Friday, September 20, 2024
spot_img

బరితెగించిన అడిషనల్ సీ.సీ.పీ. ప్రదీప్ కుమార్

Must Read
  • అక్రమ మార్గంలో పర్మిషన్లు జారీ
  • ముడుపులు ఇస్తే ఎంతకైనా తెగిస్తా
  • ఓ.సి నిర్మాణ అనుమతులిస్తున్న ప్రదీప్ కుమార్
  • టీ.ఎస్.బి పాస్ లో పారదర్శకత కరవు
  • యధేచ్చగా టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి
  • జీహెచ్ఎంసీ కమిషనర్ పర్మిషన్ లేకుండానే ఓ.సీ.ల జారీ.!
  • ముక్కున వేలేసుకుంటున్న సామాజిక వేత్తలు

‘తాను చెడ్డ కోతి వనమంతా చెడిపిందంట’ అన్నట్టు కొంద‌రు అవినీతి అధికారులు ఒకరినీ చూసి మరొకరు తయారవుతుండ్రు. ఎంత మంది ఏసీబీ పట్టుబడ్డ, సస్పెన్షన్ కు గురవుతున్నా కూసింత అయినా బుద్ధి, జ్ఞానం లేకపోవడం విచారకరం. ప్రభుత్వ అధికారి అంటే ప్రజలకు ఏదీ మంచో, ఏదీ చెడో పరిశీలన చేసి తదనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది.. అది వారి బాధ్యత.. ఎందుకంటే ప్రజానీకం కట్టే పన్నులతో వేలకు వేలు జీతాలు తీసుకుంటూ.. అది చాలదన్నట్లు అక్రమార్జనకు తెగబడుతున్న అధికారులున్నంత వరకు.. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎన్ని పథకాలకు రూపకల్పన చేసినా.. ఎన్ని గొప్ప గొప్ప చట్టాలు రూపొందించినా అవి బూడిదలో పోసిన పన్నీరు చందంగానే మిగిలిపోతున్నాయి. ఇలాంటి కోవకు చెందిన ఓ అవినీతి అధికారి ఆగడాలు ఇప్పుడు చూద్దాం..

మాకు ఎవ్వరూ సాటి రారు, మాకు ఎవ్వరూ పోటీ లేరు.. అన్నట్టుగా అక్రమాలకు పాల్పడుతున్నారు అవినీతి టౌన్ ప్లానింగ్ అధికారులు.. జీవో నెంబర్ 168, టి.ఎస్.బి పాస్ కొత్త మున్సిపల్ చట్టానికి తూట్లు పొడుస్తూ డబ్బులకు అమ్ముడుపోయి నాలాలపై, ప్రభుత్వ స్థలాలపై పర్మిషన్లు ఇస్తున్నారు ప్రదీప్ కుమార్. టౌన్ ప్లానింగ్ లో డైరెక్టర్ స్థాయిలో అడిషనల్ సీసీపీ పోస్టులో ఉండి అక్రమాలకు పాల్పడుతున్న ఈ అవినీతి అధికారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వెల్లువెత్తుతున్నాయి.

అడిషనల్ సి.సి.పి ప్రదీప్ కుమార్ భారీ మొత్తంలో ముడుపులు అందుకుని ఓసీ పర్మిషన్ ఇవ్వడం శోచనీయం. పార్ట్మెంట్ నిర్మాణం చేపడితే ఫైర్ అండ్ సేఫ్టీ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని అపార్ట్మెంట్ చుట్టు పక్కల స్థలం వదిలి భవిష్యత్తులో పర్యావరణ సమతుల్యం కోసం పార్కు స్థలం వదిలి, చిన్న పిల్లలు ఆడుకోవడానికి కొంత స్థలం కేటాయించాలి ఇది చట్టంలోని ముఖ్యమైన నియమ నిబంధనలు. అపార్ట్మెంట్ నిర్మాణంలో 5 శాతం పైచిలుకు స్థలం వదిలి నిర్మాణం చేపట్టాలి. నిర్మాణదారుడు ఈ నిబంధనలను అతిక్రమిస్తే మార్టిగేజ్ (ప్రభుత్వం) జీహెచ్ఎంసీ రిలీజ్ చేయదు. అదే విధంగా ఓసి ఆక్యుపెన్సి సర్టిఫికెట్ నిరాకరిస్తారు.. ఓసి ఆక్యూపెన్సి లేని అపార్ట్మెంట్ లో ప్లాట్లు కొనడానికి, నివాసం ఉండడానికి ప్రజలు నిరాకరిస్తారు. అదేవిధంగా భవిష్యత్తులో ఏమైనా అగ్ని ప్రమాదాలు జరిగితే ప్రభుత్వం నుండి ఎలాంటి భద్రత సౌకర్యాలు కలగవు. నష్టపరిహారం కూడా చెల్లుబాటు కాదు.. బ్యాంకులు సైతం నష్టపరిహారాలను నిరాకరిస్తాయి.

మహానగరం అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొంద‌రు బిల్డర్లు కక్కుర్తి పడి ఇరికిరుకు నిర్మాణాలు చేపట్టి, ప్రజలను మోసం చేసి ప్లాట్లు అంటగట్టి ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితుల్లో. కొందరు నిజాయితీగల టౌన్ ప్లానింగ్ అధికారులు ఫైర్ అండ్ సేఫ్టీ, మున్సిపల్ నిబంధనలు పాటించని నిర్మాణాలకు ఆక్యుపెన్సి ఇవ్వకుండా పలుమార్లు రిజెక్ట్ చేసి ఉన్నారు.. ఇలాంటి ఫైల్స్ మన మహానగరంలో వేళల్లో ఉంటాయి.. అక్రమ నిర్మాణదారుడు ఈ అక్రమ నిర్మాణాలకు ఎంతైనా మూడు పూలు ముట్టజెప్పి, టౌన్ ప్లానింగ్ అధికారి నుండి ఓసి తీసుకునే ప్రయత్నంలో ఎప్పుడూ అధికారిని బుజ్జగిస్తూ ఉండడం.. టౌన్ ప్లానింగ్ అధికారి అవినీతిపరుడైతే లక్షల కోట్లు మూటగట్టుకోవడం ఖాయం.

కొందరు అవినీతి అధికారులు ఇదే పనిగా అక్రమ నిర్మాణాలకు అనుమతులు, ఆక్యు పెన్సి సర్టిఫికెట్లు ఇవ్వడమే పనిగా పెట్టుకుని కోట్లు సంపాదించి, లంచం తీసుకునే క్రమంలో ఏసీబీకి చిక్కడం, వార్తల్లోకి ఎక్కడం నేడు పరిపాటిగా మారింది.

ప్రభుత్వ అధికారుల్లోనే అవినీతి తిమింగలం జీహెచ్ఎంసీ అడిషనల్ సి.సి.పి ప్రదీప్ కుమార్ భారీ అవినీతికి పాల్పడ్డాడు. లక్షల్లో లంచం తీసుకొని ఓసి పర్మిషన్ జారీ చేశాడు అనడానికి ఆధారం ఈ క్రింది ఫైల్ నెంబర్ వివరాలు చూడండి..

009528/జీ.హెచ్.ఏం.సీ./4735/ఎల్.బీ.ఎన్ 1/2023-ఓసీ.
ఓసి ప్రొసీడింగ్ నెంబర్:6143/జీ.హెచ్.ఏం.సీ/ఎల్.బీ.ఎన్/2024-ఓసీ.
ప్లాట్ నెంబర్ 61, సర్వేనెంబర్ 7, సరూర్ నగర్ మండలం, సరూర్ నగర్ విలేజ్, గ్రీన్ హిల్స్ కాలనీ.

సదరు అపార్ట్మెంట్ ప్రభుత్వ అనుమతులచే నిర్మాణ ప్లాన్ కు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతులను పూర్తిగా ధిక్కరించి 100శాతం డివియేషన్ తో నిర్మాణం చేపట్టబడింది. ఈ నిర్మాణానికి పలుమార్లు ఓ.సి ఆక్యుపెన్సి జారీ నిరాకరించబడింది. జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు ఏసీపీ శ్రావణి అడిషనల్ సి.సి.పి ప్రదీప్ కుమార్ లక్షల్లో లంచం మాట్లాడుకొని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదం లేకుండానే, రూ.20, రూ.30 లక్షల పైనే.. పెనాల్టీ టాక్స్ వెయ్యాలి. అలా వేయకుండా తక్కువ రూ. 1,84,000 వేసి, ఓసి జారీ చేసిన దాఖలాలు ఆధారాలతో పొందుపరచడం జరిగింది. ప్రజల జీవితాలతో చెలగాటమాడే బిల్డర్లపై, అవినీతి అధికారులపై తక్షణమే నిఘా విభాగాలు జీహెచ్ఎంసీ విజిలెన్స్ రంగనాథ్, ఏసీబీ సెంట్రల్ విజిలెన్స్ ఎంక్వైయిరీ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ విభాగానికి అధిపతిగా మున్సిపల్ శాఖ మాత్యులు సీఎం రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి.. అవినీతిని ప్రోత్సహిస్తారా..? లేక దుర్మార్గపు అవినీతి అధికారులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారు..? అన్నది వేచి చూడాలి..

టిఎస్.బి.పాస్ కొత్త మున్సిపల్ చట్టం అవినీతి అక్రమాలను ప్రజలకు ప్రభుత్వానికి తెలియపరిచే క్రమంలో తదుపరి కథనంలో మీ ముందుకు…’ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This