హైదరాబాద్ లోని లండన్ స్కూల్ అఫ్ బిజినెస్, లండన్ ఏవియేషన్ అకాడమీలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతియేటా అషాఢమాసం లో జరిపే బోనాల పండుగ కాకతీయ కాలం నుండే అనాదిగా వస్తున్న ఆచారం. అయినప్పటికీ సైన్స్ పరంగా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయని, బోనంలో వండిపెట్టే బెల్లం అన్నం ఆరోగ్యమే, అలాగే బోనాలకు ఉపయోగించే పసుపు, కుంకుమ, వ్యపరిల్లలు, దీపం ఇవన్నీ పెట్టీ గ్రామాల్లో వందల సంఖ్యలో తిరుగుతుంటే గ్రామాల్లో ఉన్న అనేక రకాల రుగ్మతలు తొలగిపోయి మంచి గాలి మంచి వాతావరణం ఏర్పడుతాయని దాని వల్ల ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తారని తెలిపారు. ఇది అమ్మవారికి బోనాలు సమర్పించడంలో అనాదిగా వస్తున్న ఆచారంలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యమన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లక్ష్మి నరసింహన్, కె.వైష్ణవి, జి.ఝాన్సీ, మానస, బిందు, డి.భావన, అనిత రెడ్డి తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.