Friday, September 20, 2024
spot_img

వసూల్‌ రాజాలు

Must Read
  • ఠాణాల్లో పైసల్ వసూల్
  • ఎస్‌హెచ్‌ఓలకు అంతా తామై వ్యవహరిస్తున్న రైటర్లు
  • ఏళ్ల తరబడి ఒకే స్టేషన్‌లో తిష్ట
  • ఫైరవీలతో అదే స్టేషన్ లో విధులు
  • ఇదే అదునుగా వసూళ్ల పర్వం
  • అందరూ బదిలీ అయినా వీరు మాత్రం అక్కడే

చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం మూడు సింహాలు అయితే కనిపించని నాలుగో సింహామేరా పోలీస్ అనే సినిమా డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది.కానీ దీని విరుద్దంగా నడుచుకుంటున్నారు నేటి పోలీసులు. పోలీసులు అంటే కొంత మందికి భయం, మరికొంత మందికి గౌరవం ఉంటుంది.ఖాకీ డ్రెస్సుకు ఉన్న వాల్యూ అదీ.కానీ దీన్ని కొంతమంది మిస్ యూస్ చేస్తారు కూడా. స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు, స్టేషన్ బెయిలు, ఎన్ఓసీ లు, ఏదైనా పర్మిషన్ లు ఇలా పోలీస్ స్టేషన్ లకు వెళ్లే ప్రతి ఫిర్యాదుతో ఆ స్టేషన్ రైటర్ కు సంబంధం ఉంటుంది. ప్రతి అవసరానికి రైటరే ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాడు కాబట్టి. అతను పని చేసే మండలం, టౌన్ లో ఏళ్ల తరబడి పాతుకొని పోయి ఉండటంతో, ఏ కేసులలో ఎంత వెనకేసుకోవచ్చు అనే లెక్కలు వీరికి బాగా తెలుసు.. జిల్లా వ్యాప్తంగా ఒకే దగ్గర ఏళ్ల తరబడి పాతుకుపోయిన స్టేషన్ రైటర్ల పై ఆదాబ్ హైదరాబాద్ లో ప్రత్యేక కథనం..

పోలీస్‌ స్టేషన్ లకు సంబంధించి కార్యకలాపాలన్ని నమోదు చేసే బాధ్యత రైటర్లది. వీరందరూ కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగులు. ఒక్క మాటలో చెప్పాలంటే స్టేషన్‌లో పనిచేసే ఉద్యోగుల్లో వీరే కీలకం. అంతటి బాధ్యత కలిగిన రైటర్లు ఇదే అదునుగా చేసుకొని ఠాణాల్లో వసూల్‌ రాజాలుగా మారి పోలీస్‌ శాఖకు మచ్చ తీసుకొస్తున్నారు. ‘అన్నం పెట్టే వాడికన్నా సున్నం పెట్టే వాళ్లే ఎక్కువ’ అన్నట్టు సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, తుంగతుర్తి పోలీస్‌ స్టేషన్‌లలో విధులు నిర్వర్తించే రైటర్లు అక్రమ సంపాదనకు మరిగి వసూళ్లకు తెగబడ్డారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వర్తిస్తున్న రైటర్లు, ఫిర్యాదుదారులు నింధితుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు బహిరంగ ఆరోపణలు వెల్లివెత్తుతున్నాయి. అంతేకాదు.. స్టేషన్ లలో చిన్న చితక పని కోసం వచ్చే వారి నుంచి ముక్కుపిండి వసూళ్లు చేయడమే కాకుండా, రాత్రి సమయాల్లో కొంతమంది చోటమోట నాయకులతో కలిసి డిన్నర్ సైతం హాజరవుతూ పోలీస్‌ శాఖ పరువును బజారుకీడిస్తున్నారు.

కీలక విధులు..

పోలీస్‌ స్టేషన్లలో రైటర్లది కీలకమైన పాత్ర అని చెప్పొచ్చు. స్టేషన్లకు సంబంధించి కేసుల పంచనామాలు రాయడంతో పాటు సీడీ (కేసు డీరీ), ఎన్‌ఓసీలు తదితర అంశాలన్ని ఆన్‌లైన్‌ లో నమోదు చేస్తారు. అంతేకాకుండా స్టేషన్‌లో సిబ్బందికి డ్యూటీలు, బందోబస్తు విధులు కూడా వీరే కేటాయిస్తుంటారు. ప్రధానంగా స్టేషన్‌ బెయిల్‌ విషయంలో వీరికి మంచి లాభం ఉంటుందని, దీనికి తోడు సెటిల్‌ మెంట్లు, నెలనెలా వచ్చే వసూళ్లు సైతం రైటర్లే వసూలు చేసి తమ జేబు నింపుకున్నాక అధికారులకు వాటాలుగా ఇస్తారని వినికిడి. అలాగే ఇంకొందరు రైటర్లు తమకు అనువుగా ఉండే కానిస్టేబుళ్లను డబ్బా రైటర్లుగా పనిచేయిస్తూ,వారి ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. వసూళ్ల విషయంలో నింధితులు, ఫిర్యాదుదారులే కాక సొంత శాఖ సిబ్బందిని కూడా ఈ రైటర్ లు వదలరని విశ్వసనీయ సమాచారం.

అవసరాల పేరిట మళ్ళీ అక్కడే మకాం..

జిల్లాలోని చాలా మంది రైటర్లు ఒకే స్టేషన్‌లో ఏళ్లుగా తిష్టవేశారు. తద్వారా వారి అక్రమ సంపాదనకు అడ్డు లేకుండాపోయిందని తెలుస్తోంది. కొందరు రైటర్లు ఇతర స్టేషన్లకు బదిలీ అయినా అవసరం పేరిట ఎస్‌హెచ్‌ఓ ల ఫైరవీ లతో అటాచ్‌ మెంట్ల ద్వారా మళ్ళీ పాత స్టేషన్‌కు రావడం పరిపాటిగా మారింది. కొన్ని స్టేషన్ల లో పదేళ్లకు పైగా కూడా పనిచేస్తున్న రైటర్లు ఉన్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ లకు రైటర్లే అంతా అయి వ్యవహరిస్తున్నారనే విషయం తెలిసిందే. స్టేషన్లకు వచ్చే పిర్యాదుదారులు, ఎన్‌ఓసీలు, ఏదైనా సర్టిఫికెట్లు తీసుకోవాలంటే వీరికి డబ్బు ముట్టజెప్పాల్సిందేనని తెలుస్తోంది. అలాగే, ప్రతి కేసు నమోదు విషయంలో అటు పిర్యాదుదారులు, ఇటు నింధితుల నుంచి, డబ్బులు వసూలు చేస్తున్న రైటర్ లు, అధికారులకు వాటాలు ఇస్తున్నామని చెప్పడమే తప్ప, వారికిచ్చేది దేవుడెరుగు కానీ.. వీరు జేబులు నింపుకోవడం అలవాటుగా మారిపోయిందని విమర్శలు వస్తున్నాయి. దీంతోనే రైటర్ల వ్యవహార శైలి తెలిసినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తారనే ప్రచారం జరుగుతుంది.జిల్లాలోని స్టేషన్ రైటర్ల వ్యవహార శైలి,వారు నాయకులతో కలిసి చేస్తున్న విందులపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించాలని ఫిర్యాదుదారులు, పోలీసు సిబ్బంది కోరుతున్నారు.

మొత్తంగా పోలీస్ శాఖకు కొంతమంది చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నారనీ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇకనైన నాలుగో సింహాలాగా ఉంటే ఆ డిపార్ట్ మెంట్ కు మంచి పేరు ప్రాఖ్యాతలు తీసుకొచ్చినవారు అవుతారని మేథావులు సూచిస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This