- వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా
- ధరణి దేశంలోనే అతిపెద్ద స్కాం
- వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు
- బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్
- బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉంది
- పండుగకు సర్కార్ నిధులివ్వలే
- ఒక మతానికి కొమ్ముకాస్తూ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది
- హిందువుల పండుగలంటే అంతా చులకనా
- కాంగ్రెస్ ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండిసంజయ్ ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫోర్త్ సిటీ’ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విమర్శించారు.ఆదివారం మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడలో జరిగిన బోనాల ఉత్సవాలకు హాజరయ్యారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి,రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.ధరణి పేరుతో దాదాపు రూ.2 లక్షల కోట్ల స్కాం జరిగిందని,దేశంలోనే అతిపెద్ద స్కాం ధరణి అని పేర్కొన్నారు.కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తూ వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు.అనంతరం తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉందని,బోనం పండుగకు సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగకు నిధులివ్వలేదని విమర్శించారు.హిందువుల పండుగలకు పైసలివ్వరు కానీ సెక్యులరిజం పేరుతో ఒక మతానికే కొమ్ముకాస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు.రంజాన్ పండుగకు రూ.33 కోట్లు,హిందువులను చంపిన తబ్లిగీ జమాతే సంస్థకు 2 కోట్ల 40 లక్షలు విడుదల చేసిన కాంగ్రెస్ అదేదో ఘన కార్యంగా చెప్పుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు.హిందువుల పండుగలంటే అంత చులకనా? అని ప్రశ్నించారు.బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎం.ఐ.ఎం పార్టీకి కొమ్ము కాస్తుందని ఆరోపించారు.15 నిమిషాల సమయమిస్తే హిందువులను నరికి చంపుతానన్న అక్బరుద్దీన్ ఒవైసీని తీసుకెళ్లి కొడంగల్ లో పోటీ చేయిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించడం సిగ్గు చేటని విమర్శించారు.అనంతరం రుణమాఫీ గురించి మాట్లాడుతూ,ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని తెలిపారు.లక్ష లోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్య గత ప్రభుత్వ హయాంలో 36 లక్షల మంది ఉంటే,లక్షన్నర లోపు రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య 18 లక్షలు దాటకపోవడం విడ్డురంగా ఉందని వ్యాఖ్యనించారు.తెలంగాణ ఏర్పడిన 2014 నాటికి రాష్ట్రంలో 24 లక్షల అసైన్డు భూములుంటే నేడు ఆ భూములు ఐదు లక్షలకు ఎలా తగ్గాయని ప్రశ్నించారు.అసైన్డు భూములను,శిఖం భూములను,దేవాదయ,అటవీ,భూదాన భూములతోపాటు పేదల భూములను కూడా ధరణి పేరుతో బీఆర్ఎస్ నాయకులు దండుకున్నారని విమర్శించారు.రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారి వివరాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు.గ్రేటర్ హైదరాబాద్ శివారులోని 33 గ్రామపంచాయతీలు,20 పురపాలక సంఘాలు,8 కార్పొరేషన్లు,61 పారిశ్రామిక వాడలు,కంటోన్మెంట్ బోర్డు, వీటన్నింటినీ గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన అర్ధం లేనిదని విమర్శించారు..