ఖాకీలకు లాఠీ దొరికితే చాలు పేద,బడుగు బలహీనవర్గాల వారైతే చాలు
జులిపించేందుకు వెనుకాడరు..వాళ్ళైతే వచ్చి ఎవరు అడగరు కదా..
అదే బలిసినోళ్లు,పెద్ద కులపోళ్ల జోలికి పొతే మంచిగుండరు..మా ఉద్యోగులకు ఎందుకు రిస్క్ అనుకుంటారు..
అదే చిన్న దొంగతనం కేసైనా సరే తీవ్రంగా గాయపరుస్తారు..
అసలు ఎందుకు కొడుతున్నామో అనే సోయి ఉండదు..ఖాకి డ్రెస్సు వేసుకొంగనే మదం ఎక్కుతుంది కొందరికి..
లాకప్ డేట్ లకు సైతం వెనుకాడరంటే..వీళ్ళ కండకావరం ఏంటో అర్థం చేసుకోచ్చు..
అందర్నీ ఒకలా చుడండి పోలీసన్నా..నీ ప్రతాపం దళిత,బలహీనవర్గాల మీద కాదు జెర్ర మమ్మల్ని మీరైనా లెక్క
చేయండి సుమా..!!
- సురేందర్