- కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 ను రద్దు చేసి నేటికీ ఐదేళ్లు పూర్తయ్యాయి.ఈ సంధర్బంగా కేంద్రప్రభుత్వం పై కాంగ్రెస్ జాతీయ అద్యక్షులు మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆర్టికల్ 370ను రద్దు చేస్తే అక్కడి పరిస్థితి మెరుగుపడుతుందని,ఉగ్రవాదుల దాడులు తగ్గుముఖం పడతాయని ప్రధాని మోదీ అన్నారని గుర్తుచేశారు.కానీ ప్రధాని వ్యాఖ్యలకు భిన్నంగా జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని వ్యాఖ్యనించారు.దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి జమ్మూలో 25 ఉగ్రదాడులు జరిగాయని తెలిపారు.సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం జమ్ముకశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.