Friday, November 22, 2024
spot_img

డబ్బు కొట్టు అక్రమ నిర్మాణాలు కట్టు

Must Read
  • నయా దందాకు తెరలేపిన టౌన్ ప్లానింగ్ విభాగం సెక్షన్ ఆఫీసర్
  • నోటీసులు ఇచ్చి డబ్బులు దండుకోవడం పైనే అధికారుల శ్రద్ధ
  • అక్రమ నిర్మాణాలలో ఏసిపి సంతోష్ వాటా ఎంత?
  • గాజుల రామారం సర్కిల్ టౌన్ ప్లానింగ్ లో జరుగుతున్న దందాపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్

పచ్చ నోట్లు పడేస్తే కానీ పని అంటూ ఉండదనే సామెతను అక్షరాల నిజం చేస్తున్నారు గాజులరామారం సర్కిల్ సూరారం డివిజన్ సెక్షన్ ఆఫీసర్. డబ్బు కొట్టు అక్రమ నిర్మాణాలు కట్టు అనే నయా దందాకు తెర లేపారు. అందుకు అనుగుణంగానే సూరారం డివిజన్ పరిధిలోని అనుమతులకు మించి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలకు నోటీసులిచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే. టౌన్ ప్లానింగ్ ఏసిపితో పాటు పై అధికారులకు సైతం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి మరి నిర్మాణదారుల వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తుందని నిర్మాణదారులు తలలు పట్టుకుంటున్నారు. ఫిర్యాదులు అందుతున్నాయని పై అధికారులకు తాను సమాధానం చెప్పుకోవాలని బిల్డింగ్ నిర్మాణం మధ్యలో అక్కడక్కడ కూల్చివేతల సైతం చేసిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూరారం డివిజన్‌లో ఇంత బహిరంగంగా వసూళ్లకు పాల్పడుతూ అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తుండడం ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతుందని ప్రచారం ఉంది. ప్రభుత్వాలు మారిన, చట్టాలు మార్చిన వాటిని అమలు చేయాల్సిన అధికారులు తీరు మారకపోతే ప్రభుత్వ ఆదాయానికి గండితోపాటు ప్రభుత్వ పాలన పై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇలాంటి అధికారులపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారిస్తే తప్ప వీరి తీరు మారేటట్టు లేదంటూ పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకొని అక్రమ నిర్మాణాలు అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝులిపిస్తారా లేక అమ్యామ్యాలకు ఆశపడి అక్రమాలను సక్రమం చేస్తారా? సూరారం డివిజన్ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై మరో కథనం ద్వారా ఆదాబ్ మీ ముందుకు తేనుంది… ఆదాబ్ హైద‌రాబాద్‌.. మా అక్షరం అవినీతిపై హస్త్రం…

గాజుల‌రామారంలో టౌన్ ఫ్లానింగ్ విబాగంలో జ‌రుగుతున్న అక్ర‌మ వ‌సూల‌పై ఆదాబ్ హైద‌రాబాద్ ప్ర‌తినిధి సెక్ష‌న్ ఆఫీసర్‌ వివ‌ర‌ణ కోసం ఫోన్ ద్వారా, మేసెజ్ ద్వారా ప్ర‌య‌త్నించ‌గా, వారి నుండి ఎలాంటి స్పంద‌న రాలేదు

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS