రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నా విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఆందోళనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.దింతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు.షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో బాంగ్లాదేశ్ పాలన ప్రస్తుతం సైన్యం ఆధీనంలోకి వెళ్ళింది.మరోవైపు బాంగ్లాదేశ్ లో పరిస్థితిలు అదుపుతప్పడంతో భారత్-బాంగ్లాదేశ్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు.కూచ్‌బెహార్,పెట్రాపోల్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ భద్రతాను కట్టుదిట్టం చేసింది.భారత్‌లోని బంగ్లాదేశ్ ఎంబసీ తో హైకమిషన్ వద్ద భద్రతాను పెంచారు.
బాంగ్లాదేశ్ లో పరిస్థితి అదుపు తప్పడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.సరిహద్దు దాటి మన దేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు.తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద నుంచి వందలాది మంది బంగ్లాదేశ్ ప్రజలు భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా వారిని బీఎస్ఎఫ్ దళాలు అడ్డుకున్నాయి.వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు.