ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న కవితతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి భేటీ అయ్యారు.ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ కవిత ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేశారు.జైల్లో కవిత అనేక ఇబ్బందులు పడుతుందని,బీపీతో బాధపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.రోజుకు రెండు బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటుందని తెలిపారు.జైలు పరిశుభ్రంగా లేదని తెలిపారు.కవితకు వచ్చే వారం బెయిల్ వచ్చే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.