Friday, September 20, 2024
spot_img

హైదారాబాద్ లో ఏఎన్ఎంలు ఎక్కడా..?

Must Read
  • మహానగరానికి అనారోగ్యం.. చోద్యం చూస్తున్న ఆరోగ్యశాఖ
  • ఏఎన్ఎంలు లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఖాళీ
  • గతకొంత కాలంగా ఖాళీగా 74 శాంక్షన్డ్ పోస్టులు
  • అవి భర్తీ చేయకపోగ ఇక్కడ్నుంచి జిల్లాలకు బదిలీ
  • ఇటీవల 120 మంది ఏఎన్ఎంలు ట్రాన్స్ ఫర్
  • దాదాపు 40 లక్షల జనాభా ఉన్న పట్నంలో పనిచేసే వారే లేరు
  • జిల్లా పోస్టులను జోనల్ పోస్టులు మార్చిన గత సర్కార్
  • ఆరో జోన్ లో ఉన్న వారంతా ఇతర జిల్లాలకు ట్రాన్స్ ఫర్ చేసిన వైనం
  • ఏదైనా బీమార్ లేదా సీజనల్ వ్యాధులు వస్తే పరిస్థితి ఏంటీ.!
  • పిల్లలకు వ్యాక్సినేషన్, గర్భిణీ స్త్రీలకు సూదులు వేసే వారే కరవు
  • మంత్రి గారూ స్పందించి కొత్త పోస్టులు భర్తీ, సరిపడా ఏఎన్ఎంలు ఉండేలా చూడాల‌ని విన‌తి

హైదరాబాద్ సిటీలో పనిచేసేందుకు ఏఎన్ఎంలు కరవు అయ్యారు. రెండు పార్లమెంట్, పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నది. భాగ్యనగరంలో మొత్తం 3 ఏరియా ఆస్పత్రిలు, 14 అర్బన్ న్యూట్రీషియన్ హెల్త్ క్లస్టర్స్ (యూహెచ్ఎన్.సీ), 85 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్.సీ) ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో సుమారు 40లక్షలకు పైగా జనాభా ఉన్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్యులు, నర్సులు లేకపోవడం దురదృష్టకరం. గాంధీ, ఉస్మానియా వంటి పెద్ద ఆస్పత్రులు ఉన్నప్పటికి వాటిలో పనిచేసేందుకు పెద్ద నర్సులు (స్టాప్ నర్స్) పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం. ఆపరేషన్ థియోటర్స్ లో కూడా పనిచేసే నర్సులు సైతం లేకపోవడం శోచనీయం. అన్ని డివిజన్లల్లో అందుబాటులో ఉండాల్సిన ఏఎన్ఎంలు లేకపోగా స్థానికంగా ఉన్న పేద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక్కడ చిన్న పిల్లలకు టీకాలు వేసేవాళ్ళు, గర్భీణి స్త్రీలు ఇంజెక్షన్లు, ఏదైనా బీమారు, సీజనల్ వ్యాధులు వస్తే చాలా కష్టతరం. జ్వరమోస్తే మందుగోళీలు ఇచ్చే వాళ్ళు కూడా ఎవరూ అందుబాటులో లేరు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఏఎన్ఎంల కొరత విపరీతంగా ఉంది. వాస్తవానికి ఈ జిల్లా పరిధిలో 194మంది ఏఎన్ఎంలు ఉండాలి. కానీ, గతంలో 120 మంది ఏఎన్ఎంలు మాత్రమే విధులు నిర్వర్తించారు. అప్పటికే వీరిపైనా ఫుల్ వర్క్ లోడ్ ఉండేది. ఆ సమయంలో ఏదో ఒక రకంగా ఒత్తిడిని దిగమింగుతూ డ్యూటీ చేశారు ఏఎన్ఎంలు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు. పలు పెద్ద పెద్ద కంపెనీలు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు, ఇతర చిన్న, పెద్ద తరహా సంస్థలు, కూలీ పని కోసం పట్నం వచ్చి బతుకుతున్నారు. దాదాపు భాగ్యనగరంలో కోటి మందికిపైగా నివాసం ఉంటున్నారు. ఇంత జనాభా ఉన్న మహానగరంలో ఆరోగ్య సమస్యలు వస్తే చూసే వాళ్లు లేకపోవడం దారుణం. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు డివిజన్లు, మున్సిపాలిటీల వారీగా ప్రజల బాగోగులను చూసుకునే వారే ఏఎన్ఎంలు. పిల్లలకు జ్వరం, వాంతులు, విరోచనాలు, సీజనల్ వ్యాధులు ఇతరత్రా ఏమి వచ్చిన వెంటనే సంప్రదించేది స్థానిక ఆరోగ్య కేంద్రాన్నే. డబ్బు ఉన్న వారు పెద్ద హాస్పిటల్స్ కు వెళ్లిన, చిన్న ఉద్యోగాలు, కూలి పనిచేసుకునే వారు హెల్త్ సెంటర్లకే వెళ్తారు. అక్కడుంటే ఏఎన్ఎంలు చూసి మందుగోలిలు ఇస్తుంది. ఇక పోతే పిల్లలకు, గర్బిణీ స్త్రీలకు వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నా, నెల నెల వారికి పరీక్షలు చేయాలన్న ఏఎన్ఎంల పాత్ర చాలా కీలకం. ప్రెగ్నెంట్ మహిళలను ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి డాక్టర్ చూపించి సరైన సలహాలు ఇవ్వడం కూడా ఏఎన్ఎంలదే బాధ్యత.

అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపానికి హైదరాబాద్ జిల్లా పోస్టులను 6వ జోన్ కిందకి మార్చుతూ అప్పటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాస్ 2018లో జీవో తీసుకొచ్చారు. ఈ క్రమంలో చాలా మంది ఆరు జిల్లాల పరిధిలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్, ఛార్మినార్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి కలిపి 6వ జోన్ కింద వచ్చాయి. కాగా ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్ ఫర్స్ లో హైదరాబాద్ జిల్లాలో ఉన్న ఏఎన్ఎంలు అందరూ ఆయా జిల్లాలకు బదిలీపై వెళ్లడం జరిగింది. మొత్తం 120 మంది ఏఎన్ఎంలను ఆరోగ్యశాఖ జిల్లాలకు పంపారు. కాగా ఇప్పుడు పట్నంలో ఉన్నది కొంత‌మంది ఏఎన్ఎంలు. అదేవిధంగా గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో పనిచేసే పెద్ద సిస్టర్లు కూడా బదిలీపై వెళ్లారు. ఆపరేషన్ థియోటర్ లలో పనిచేసే ఇంఛార్జ్ నర్సులు లేకపోవడంతో చాలా ఇబ్బంది తలెత్తుతుంది. అధికారుల అవగాహన లోపం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉండే అధిక జనాభాకు ఎక్కువ మంది ఏఎన్ఎంలు ఉండాల్సింది పోయి ఉన్నవారిని పక్క జిల్లాలకు బదిలీపై పంపడం ఏంటని పలువురు మేథావులు ప్రశ్నిస్తున్నారు. సిటీలో ఉండే జనాలు అనారోగ్యం బారినపడితే పరిస్థితి ఏంటనీ నిలదీస్తున్నారు. మంజూరైన 74 ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. పైగా పట్నంలో పనిచేస్తున్న 120 మంది ఏఎన్ఎంలను ట్రాన్స్ ఫర్ చేయగా ఇక్కడికి నలుగురే బదిలీపై వచ్చారు. అంటే ఇంకా 116 ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంత పెద్ద భాగ్యనగరంలో ఏఎన్ఎం లు లేకుంటే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి ఆరోగ్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులు దృష్టిసారించి ఖాళీగా ఉన్న ఏఎన్ఎంలు పోస్టులు భర్తీ చేయాలని, త్వరగా అన్ని డివిజన్లలో ఏఎన్ఎం పోస్టులు, గాంధీ, ఉస్మానియా దవాఖానలో సరిపడ స్టాప్ నర్సులను నియమించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This