తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది.తెలంగాణ ఆర్థికాభివృద్ది,ఉద్యోగాల కల్పనకు తోడ్పడే పెట్టుబడుల సేకరణ,ఒప్పందాల నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి కాలిఫోర్నియాలోని గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.అయిన వెంట పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.తెలంగాణలో టెక్ సేవల విస్తృతి,ఏఐ సిటీ నిర్మాణం,స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర ప్రాజెక్టుల్లో భాగం పంచుకునే విషయమై గూగుల్ సంస్థ ఉన్నతాధికారులతో తెలంగాణ బృందం చర్చలు జరిపింది.