Saturday, November 23, 2024
spot_img

అవినీతి అధికారుల‌పై వేటు

Must Read
  • స‌స్పెన్ష‌న్‌ కు గురైన ఎండీ షేర్ అలీ, వి. హ‌నుమంత రావు
  • అనిశా ఆక‌స్మిక త‌నిఖీలో అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్న ఏసీబీ అధికారులు
  • రూ. 94,590లు న‌గ‌దు స్వాధీనం
  • డబ్బులను కిటికిలోనుండి బ‌య‌ట‌ప‌డేసిన వైనం
  • డెస్క్ ఆప‌రేట‌ర్లు మౌనిక‌, సౌమ్య‌కు భాగస్వామ్యం
  • సర్వీసు నుంచి పర్మినెంట్ గా రిమూవ్ చేయాలని డిమాండ్

ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వేలాది రూపాయల జీతం తీసుకుంటూ లంచలకు అలవటుపడ్డారు కొందరు. పనికోసమని ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల వద్ద లక్షల రూపాయలు లంచాలు డిమాండ్ చేస్తున్నారు. కొందరూ డబ్బు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం, వారిపై చర్యలకు దిగుతున్నప్పటికి అదరకబెదరక ఉద్యోగులు తమ పని తాము కానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే… ప‌ఠాన్‌చెరులోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ -2 జిల్లా కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు ఆక‌స్మిక త‌నిఖీలు చేపట్టారు. అక్క‌డ విధులు నిర్వ‌ర్తిస్తున్న మాజీ జాయింట్ స‌బ్ రిజిస్ట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ షేర్ అలీ (ప్ర‌స్తుతం వికారాబాద్ స‌బ్ రిజిస్టార్‌గా పనిచేస్తున్నారు.) మ‌రియు జాయింట్ స‌బ్ రిజిస్ట‌ర్ -1 వి. హ‌నుమంత రావు (ప్ర‌స్తుతం ఘ‌ట్‌కేస‌ర్ స‌బ్ రిజిస్టార్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు). కాగా, అనిశా అధికారులు అక‌స్మికంగా త‌నిఖీలు చేయ‌డంతో ఈ ఇద్ద‌రు అధికారులు కార్యాల‌యంలో వెనుక‌భాగంలో ఉన్న కిటీకీలోనుండి కొంత మొత్తాన్ని బ‌య‌ట‌కు విసిరివేసిన‌ట్లు అనిశా అధికారులు ధృవీకరించారు. ఇతరుల ద్వారా విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు అక్క‌డకు చేరుకొని త‌నిఖీలు చేయ‌గా దాదాపు రూ.73,140 లు చెల్లాచెదురుగా ప‌డివున్న‌ట్లు గుర్తించారు. ఆ న‌గ‌దు అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

మరోవైపు త‌నిఖీల స‌మ‌యంలో ప్రింట‌ర్ & డెస్క్ లో విధుల్లో ఉన్న మౌనిక, సౌమ్య‌ల వ‌ద్ద రూ. 21,450లు, కుమ్మ‌రి ముర‌ళి మోహ‌న్ అనే వ్య‌క్తి వాహ‌న‌పు ఒరిజిన‌ల్ ఆర్‌సి దొరికింది. ఈ ఆక‌స్మిక త‌నిఖీల‌లో అనిశా అధికారులు మొత్తం రూ. 94,590లు న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారుల నివేదిక ఆధారంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ ఉన్న‌తాధికారులు లంచం తీసుకుని అవినీతికి పాల్ప‌డ్డ ఎండీ షేర్ అలీ, వి. హ‌నుమంత రావుల‌ను స‌స్పెండ్ చేశారు. వి. హ‌న‌మంత రావు గ‌తంలో అవినీతి ఆరోప‌ణ‌ల‌తో ప‌లుమార్లు స‌స్పెండ్ అయినట్లు తెలిసింది.

ఎలుక తోలు ఎన్నేండ్లు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్నట్టు అవినీతి అధికారుల బుద్ధి కూడా అలాగే ఉంటుంది. ఇదే విధంగా ప్ర‌తిశాఖ‌పై దృష్టి సారిస్తే ప్ర‌జ‌ల‌ను ప‌ట్టి పీడిస్తున్న అవినీతిని కాస్తైన అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని ప‌లువురు భావిస్తున్నారు. ప‌ట్టుబ‌డ్డ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ ఇద్ద‌రు ఉన్న‌తాధికారులు విధుల నుండి శాశ్వ‌తంగా తొల‌గిస్తే మ‌రోసారి ఇత‌ర అధికారులు అవినీతి పాల్ప‌డాలంటే భయ‌ప‌డుతారు. ఇకనైనా అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇవి తగ్గవని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS