కోల్‌కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం,హత్య ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.చంద్రచూడ్‌తో పాటు జేబీ పర్దివాలా,మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.ఈ మేరకు వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి,సభ్యుల పేర్లను కూడా వెల్లడించింది.మరోవైపు బెంగాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఆందోళనకారులపై దాడి చేయడం సరికాదని పేర్కొంది.తల్లిదండ్రులకు డాక్టర్ శరీరాన్ని అప్పగించడంలో ఎందుకు జాప్యం జరిగిందని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.