Friday, September 20, 2024
spot_img

స‌ర్కార్ భూమి ఆక్రమణపై చర్యలేవి..?

Must Read
  • స‌ర్వే నెంబర్ 462లో సర్కారు భూమి కబ్జా
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు భేఖాతర్
  • అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న తహసిల్దార్
  • ఆదాబ్ కథనంపై స్పందించిన జిల్లా యంత్రాంగం
  • సర్వేచేసి అక్రమమని తేల్చిన అధికారులు
  • అయినా.. బహుళ అంతస్తుల నిర్మాణాలు
  • ప‌ట్టించుకోని హైడ్రా క‌మీష‌న‌ర్ రంగ‌నాథ్‌

తెలంగాణలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్ సహా చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నాయి.గుట్టలు,చెట్లు, పుట్టలను సైతం అక్రమార్కులు వదిలి పెట్టడం లేదు. ఎక్కడ, ఏదీ కనబడ్డ సరే దాన్ని మింగేసే వరకు పానం ఊరుకోదు అన్నట్టు ఉంది. రాజకీయ, డబ్బు పలుకుబడితో అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని గవర్నమెంట్ భూములను సైతం కబ్జా చేసేయడమే అక్రమార్కుల పని.సంగారెడ్డి జిల్లాలో ఇలాగే వ్యవహరించారు కొందరు కబ్జాకోరులు.వీరికి స్థానిక అధికారులు తోడవ్వడం ఇంకేం భూములు కబ్జాచేసి దాంట్లో బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారు.ఈ విషయాన్ని అమీన్ పూర్ లో ప్రభుత్వ భూమి కబ్జా అంటూ ఆదాబ్ లో వార్త ప్రచురించడం జరిగింది.దీనిపై జిల్లా యంత్రాంగం కదిలింది. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన వెంటనే కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని స్థానిక తహసిల్దార్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.అయినా ఎమ్మార్వో ఆ ఉత్తర్వులను లెక్కపెట్టక పోవడం శోచనీయం. వివరాల్లోకి వెళితే..సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ గ్రామం,మండలం పరిధిలోని రెవెన్యూ రికార్డుల ప్ర‌కారం సర్వే నెం.462లో కోట్లాది విలువ చేసే సుమారు 3 ఎక‌రాల భూమి ఉంది.. అందులో దాదాపు 1 ఎక‌రం భూమిపై క‌బ్జాదారులు క‌న్నెసి మింగేశారు.ఏడీ రిపోర్ట్ ప్ర‌కారం.. స‌ర్వే నెంబర్ 462 టిపాన్ లేక‌పోవ‌డంతో ప‌క్క ఉన్న స‌రిహ‌ద్దుల ప్ర‌కారం నిర్వ‌హించిన స‌ర్వే అనుసారంగా మొత్తం విస్తీర్ణం 2.16 గుంట‌లు చూపించ‌డం జ‌రిగింది. మిగ‌తా 24 గుంట‌ల స్థ‌లాన్ని స‌ర్వే అధికారులు గుర్తించ‌లేక‌పోయారు. వారు గుర్తించిన 2 ఎక‌రాల 16 గుంట‌ల ప్ర‌కారం క‌బ్జా యొక్క వివ‌రాలు ఇలా ఉన్నాయి.

462/పార్ట్ లో 0.20 గుంటలు రోడ్డుకు కేటాయించారు. 462/పార్ట్ – 0.21 గుంటలు సబ్ స్టేషన్‌కు, 462/పార్ట్ – 0.17 గుంటల్లో 120 గ‌జాల చొప్పున 8మంది నిరుపేద జర్నలిస్ట్‌ల‌కు అధికారికరంగా కేటాయించ‌డం జ‌రిగింది. అక్ర‌మంగా ఫ్రీడమ్ ఫైటర్ అంటూ 300 గ‌జాల స్థ‌లాన్ని కొలిశెట్టి వజ్రమ్మ పేరుతో కేటాయించారు. 462/పార్ట్ – 0.08 గుంటల స్థ‌లాన్ని ప‌క్క‌నే ఉన్న సర్వే నెం.414 / 415 పట్టాదారులు క‌బ్జా చేయ‌డం జ‌రిగింది.అదే విధంగా స‌ర్వే నెంబ‌ర్ 461పట్ట‌దారుడు స‌ర్వే నెంబ‌ర్ 462లోని 0.13 గుంట‌ల ప్ర‌భుత్వ స్థ‌లాన్ని క‌బ్జా చేశారు.విద్యార్థుల‌కు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఫ్యూజ‌న్ ఇంట‌ర్‌నేషన‌ల్ యాజ‌మాన్యం బాజాప్త‌గా స‌ర్వే నెంబ‌ర్ 462లో 0.17 గుంటలు ఆక్ర‌మించాడు. ఏడీ స‌ర్వే నివేదిక ప్ర‌కారం 2 ఎక‌రాల 16 గుంట‌ల స్థ‌లంలో జ‌రిగిన అక్ర‌మాల గురించి తెలుప‌డం జ‌రిగింది.కానీ,రికార్డులో ఉన్న ప్ర‌కారం మిగ‌తా 24 గుంట‌ల స్థ‌లాన్ని గుర్తించ‌లేక‌పోయారు. జ‌ర్న‌లిస్టుల‌కు ఇచ్చిన ప‌ట్టా ప్ర‌కారం ఒక్కొక్క‌రికి 120 గ‌జాల చొప్పున మొత్తం 960 గ‌జాలు కేటాయించ‌డం జ‌రిగింది. 17 గుంట‌ల స్థ‌లంలో 960గ‌జాలు పోను మిగ‌తా స్థ‌లం క‌బ్జాకు గురైంది.

కలెక్టర్ కు కంప్లైంట్ :

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం,మున్సిపాలిటీలోని సర్వే నంబర్ 462 ప్రభుత్వ భూమిని కొంతమంది అక్రమంగా ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తూ, క‌మ‌ర్షియ‌ల్ షాపుల‌ను ఏర్పాటు చేసి భారీ ఎత్తున అద్దెలు వ‌సూలు చేస్తున్న‌ట్లు ఆదాబ్ పత్రికలో వార్తా కథనం ప్రచురించబడింది. దీనిపై క‌లెక్ట‌ర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన సర్వేలో ఈ ఆక్రమణ నిర్ధారణ అయింది. ఇక దీనిపై జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నవించడం జరిగింది. మండల రెవెన్యూ అధికారి ఈ ఆక్రమణను ప్రోత్సహించి, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులకు అక్రమంగా బదలాయించారు. అదేవిధంగా, మున్సిపల్ కమిషనర్ ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, డోర్ నెంబర్లు కేటాయించి, మున్సిపల్ టాక్స్ కూడా వసూలు చేశారు. కోట్ల రూపాయల విలువైన దాదాపు 1 ఎక‌రం ప్రభుత్వ భూమిని మాముళ్లు తీసుకొని కబ్జాదారులకు అప్పగించడం జరిగింది. ఉద్యోగస్థులు అయి ఉండి కూడా అవినీతికి పాల్పడ్డందుకు తమరు ఈ అధికారులపై కఠిన చర్యలు తీసుకొని, అదేవిధంగా ఫ్రీడం ఫైట‌ర్ అని చెప్పుకొని అక్ర‌మంగా భూమిని సొంతం చేసుకున్న వారిపై కూడా చ‌ర్య‌లు తీసుకొని, ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరడం జరిగింది.

కానీ, అమీన్‌పూర్ త‌హ‌సిల్దార్ నోటీసులు జారీ చేసిన‌ప్ప‌టికి, ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంపై ప‌లు అనుమానాల‌కు తావీస్తుంది.. అస‌లు ఆదాబ్ హైద‌రాబాద్ వార్తా క‌థ‌నం ప్ర‌చురించే వ‌ర‌కు ప్ర‌భుత్వ స్థ‌ల ఆక్ర‌మ‌ణ‌పై చ‌ర్య‌లు తీసుకోలేదంటే త‌హ‌సిల్దార్ నిర్ల‌క్ష్యం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు క‌న‌బ‌డుతుంది.. ఇప్ప‌టికైనా సంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ ఆక్ర‌మ‌ణ నిర్మాణాలు తొల‌గించి, విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించిన త‌హ‌సిల్దార్‌, మున్సిప‌ల్ అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This