(23 ఆగష్టు తొలి అంతరిక్ష దినోత్సవం సందర్భంగా)
భారత దేశం 23 ఆగష్టు 2023న చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో చంద్రయాన్ – 3 విక్రమ్ ల్యాండర్ ను విజయ వంతంగా ల్యాండ్ చేసింది. దక్షిణ ధృవ ప్రాంతాన్ని చేరుకున్న మొట్ట మొదటి దేశంగా భారత్ అవతరించింది. ఈ మైలు రాయి గౌరవించేలా భారత ప్రధాని నరేంద్ర మోడీ 23ఆగష్టు తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. తొలి అంతరిక్ష దినోత్సవాన్ని భారత దేశం అంతరిక్ష సాగా థీమ్ తో జరుపుకుంటుంది. ఇస్రో భారతీయ హాక్ ధన్ నిర్వహిస్తుంది.
భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉత్కంఠ భరితమైన క్షణాలు
భారత ప్రధాన మంత్రి సహా దేశ ప్రజానీకం సర్వత్ర ఉత్కంఠ భరితంగా టెలివిజన్ టీవీలు వీక్షిస్తున్న తరుణం.
ప్రపంచ దేశాలు కూడా ఇంతటి ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ – 3 ని భారత దేశం ఎలా నిర్వహిస్తుందని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. అప్పటికే చైనా, అమెరికా, రష్యా మూడు దేశాలు చంద్రుని ఉత్తర ధృవ ప్రాంతంలోనే ప్రయోగాలు చేశాయి. భారత దేశం అత్యంత ప్రమాదకరమైన చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో ప్రయోగం చేస్తుంది. ఈ ప్రాంతం ఎగుడు దిగుడు గుంతలు కలిగి ఉంది. తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ ప్రయోగం విజయవంతమైతే భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలకు కూడా మేలు జరుగుతుంది. ఈ కారణం చేతనే ప్రపంచమంతా చంద్రయాన్ – 3 విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో సురక్షిత ల్యాండింగ్ అయ్యే వరకు శ్రద్ధగా వీక్షించారు. ఒకే పెలు బిక్కిన సంతోషపు కేరింత ల నడుమ విజయంతో పొంగిన హృదయ శబ్దంలో కలిసి చేతుల చప్పట్లు మోగినవి. సురక్షిత ల్యాండింగ్ అయ్యేన ప్రదేశానికి శివ శక్తి పాయింట్ గా ప్రధాని నరేంద్ర మోడీ నామకరణం చేశారు.
చంద్రయాన్ – 3 ప్రయోగం
శ్రీహరి కోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి 14 జూలై 2023 న ఇస్రో చే ప్రయోగించిన మూడవ చంద్రయాన్ మిషన్. 14 జులై మధ్యాహ్నం నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి చంద్రయాన్ – 3 దూసుకెళ్లింది.
2019లో చంద్రయాన్-2 ప్రయోగం విఫలం కావడం ఆ బాధ నుండి భారతదేశం కోలుకోవాల్సి వచ్చింది. చంద్రయాన్-2 నేర్పిన పాఠాలతో ఎలాంటి తప్పులు జరగకుండా ఇస్రో జాగ్రత్తలు తీసుకుంది. దాదాపు 40 రోజులు వివిధ దశలలో ప్రయాణించిన చంద్రయాన్ – 3 జులై 23న సాయంత్రం 5 గం.లకు చంద్రుని ఉపరితలానికి 100 కి.మీ చేరుకుంది. 5:44 గం.లకు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ కమాండ్ అందించారు. ఈ ప్రయోగంలో చివరి 15 ని. ల వ్యవధిని 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్ గా నాటి ఇస్రో ఛైర్మన్ పేరు పెట్టినారు. ఈ సమయమే చాలా ప్రముఖ్య మైంది గా చెప్పవచ్చు.ఇది రఫ్ బ్రేకింక్ ఫేజ్, అల్టిట్యూడ్ బ్రేకింగ్ ఫేజ్, ఫైన్ బ్రేకింగ్ ఫేజ్, టెర్మినల్ డిసెంట్ ఫేజ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలం మీద సాప్ట్ ల్యాండింగ్ చేయడానికి నాలుగు దశలగా వర్గీకరించారు.
చంద్రయాన్ – 3 ప్రయోగం ద్వారా కలిగిన ప్రయోజనాలు
చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో చంద్రయాన్ – 3 విక్రమ్ సేఫ్ ల్యాండ్ చేయడం ద్వారా భారత్ అంతరిక్ష పరిశోధనలల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. సుమారు 14 రోజుల పాటు రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుని మీద ఉన్న ఖనిజాలను, నీటి లభ్యత మరియు ఫోటోలను విక్రమ్ ల్యాండర్ కి సమాచారం ఇవ్వగ, విక్రమ్ ల్యాండర్ ఇస్రో పరిశోధన కేంద్రానికి పంపించింది. చంద్రుని మీద పగటి పూట 120 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా రాత్రి పూట -130 డిగ్రీలుగా పంపింది. రోవర్ చంద్రుని ఉపరితలంపై ఉన్న మట్టి తో పాటు 10 సెం. మీ లోతులో ఉన్న మట్టి ఉష్ణోగ్రత, ఆ మట్టి మంచి ఇన్సు లెటర్ గా ఉన్నదని వేడి, చలి, రేడియేషన్ నిరోధించేందుకు ఈ మట్టి ఉపయోగ పడుతుందని తెలిపింది. మునుముందు కాలంలో స్పేస్ కాలని నిర్మించవచ్చునని సమాచారం ఇచ్చింది. దీనితో పాటు చంద్రుని మీద అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, సిలికాన్, ఆక్సిజన్ ఉన్నట్లుగా నిర్ధారించింది. చంద్రుని ఉపరితలం పైన సల్ఫర్ ఉన్నట్లు రోవర్ కనుగొనడం అద్భుతమైన విషయమని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
చంద్రయాన్ – 3 ప్రయోగంలో హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ మిధాని పరికరాలు
ఇస్రో మొదటి ప్రయోగం నుండి ఇప్పటి వరకు నాలుగు దశాబ్దాలుగా మిధాని సంస్థ తో భాగస్వామ్యం కలిగి ఉంది. మిధాని ఉత్పత్తులైన కోబాల్ట్ బేస్ అల్లాయ్‌లు, నికెల్ బేస్ అల్లాయ్‌లు, టైటానియం మిశ్రమాలు, ప్రత్యేక స్టీల్స్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ కాస్టింగ్‌లు ఉపయోగించబడ్డాయి.
ఇంతకీ అంతరిక్ష ప్రయోగాలు ఎందుకు
రాకెట్ ప్రయోగాలు, శాటిలైట్ల సేవలు ఈ రోజుల్లో దాదాపు అన్ని రంగాల్లోనూ అత్యవసరం. రక్షణ రంగం, పౌర సేవలు, కమ్యూనికేషన్, విద్య, వాతావరణ మార్పులు, తుపాను వంటి విపత్తుల్ని ముందే గుర్తించడం, టెలీమెట్రీ సేవలు, టెలీ మెడిసిన్, నావిగేషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఓషనోగ్రఫీ, భూమిలో ఖనిజాల అన్వేషణ, అడవుల పరిరక్షణ, బ్యాంకింగ్, టీవీ సేవలు, ఇంటర్నెట్, మారీటైం అఫైర్స్, విమానయాన రంగం సేవలు ఇలా దాదాపు అన్ని రంగాల్లోనూ శాటిలైట్ కమ్యూనికేషన్ అత్యవసరం.
చంద్రయాన్-3 విజయానికి, శాస్త్రవేత్తలకు మరియు ఇంజనీర్లకు మొదటి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ బహుమతిని కేంద్ర ప్రభుత్వం అందించింది. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా కేంద్రం మూడు రోజుల పాటు ఈ విజయోత్సవ ఉత్సహాలు జరుపుతుంది. ఈ వేడుకలు ఆగస్టు 23, 2024న న్యూ ఢిల్లీలో జరిగే ప్రధాన కార్యక్రమంలో భాగంగా ముగుస్తాయి.
కొండేటి ప్రకాష్
7981781086.