మాచర్ల మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి జైలు నుండి విడుదలయ్యారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఏం ధ్వంసం కేసులో అయిన అరెస్ట్ అయ్యారు.హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రామకృష్ణ రెడ్డి శనివారం నెల్లూరు జైలు నుండి విడుదల అయ్యారు.బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కొన్ని షరతులు విధించింది.పాస్ పోర్టును కోర్టులో సరెండర్ చేయాలనీ తెలిపింది.అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లోద్దని,ప్రతి వారం మేజిస్ట్రేట్ ముందు హాజరుకావాలని పేర్కొంది.