పీర్జాదిగూడ కార్పొరేషన్లో అడుగడుగున అక్రమాలను ఆపలేని కమీషనర్.
- పట్టపగలే మున్సిపల్ ఆదాయంను కొల్లగొడుతున్న వారిపై చర్యలేవి.
- రోడ్లన్నీ గుంతలమయమే…నాసిరకం పైపులతో డ్రైనేజీలన్నీ లీకై మురుగు నీరు రోడ్లమీదకి..
- పార్కులు, రోడ్లు కబ్జాలు, చెరువులు, సర్కార్ భూములకు మున్సిపల్ అనుమతులు. ఇదేంటి అంటే సమాధానం ఉండదు.
- అక్రమ నిర్మాణం అంటూ మూనెల్ల క్రితమే కూల్చివేత – ఇప్పుడేమో బిల్డింగ్ చివరి దశ.
మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కు ఉత్తమ కమీషనర్ అవార్డును అందుకున్న త్రిళేశ్వరరావు…
పీర్జాదిగూడ కార్పొరేషన్లో నాలుగున్నర సంవత్సరాలనుండి ఆగని అక్రమ నిర్మాణాలు. కమీషనర్ త్రిళేశ్వర రావు వచ్చిన నాటి నుండి పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నవి. ఈ మధ్యనే వరంగల్ హైవేకు అనుకోని బహుళ అంతస్తు భవనం నిర్మిస్తున్నారు. ఈ భవనం అనుమతులకు విరుద్ధంగా ఉందంటూ మూనెల్ల క్రితమే కమీషనర్ త్రిళేశ్వర రావు పాక్షికంగా కూల్చివేసారు. ప్రస్తుతం భవన నిర్మాణం చివరి దశలో ఉంది. కూల్చివేసిన చేతులతో రక్షణగా ఉన్నందుకు ఉత్తమ అవార్డు ఇస్తారా అంటూ జనం విస్తూ పోతున్నారు. ముందుచూపు లేక కార్పొరేషన్లో రోడ్లన్నీ గుంతలమయం వల్ల వాహనదారులకు చుక్కలు కనపడుతున్నాయి.
చిన్న వర్షాలకే డ్రైనేజీలు లీకై మురుగు నీరు రోడ్లమీద ప్రవహిస్తుంది.మున్సిపల్ పరిధిలో గత పాలకుల తప్పిదనం వల్ల పార్కులు, రోడ్లు కబ్జాలకు గురికాగా.. చెరువులలో, సర్కార్ భూముల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు.వీటిమీద ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడిగితే సమాధానం దాటవేస్తారు.
కార్పొరేషన్ లో జరిగే అక్రమ నిర్మాణాలను ఉపేక్షిస్తూ,అక్రమదారులకు నామ మాత్రంగా నోటీసులు జారీ చేస్తూ చేతులు దులుపు కుంటున్నారు. అక్రమ నిర్మాణదారుల వల్ల సర్కార్ కు రావాల్సిన ఆదాయం భారీగా కోల్పోతున్న చోధ్యం చూస్తున్న అసమ్మర్థ కమీషనర్ కు ఉత్తమ అవార్డు ఎలా ఇస్తారంటు మున్సిపల్ ప్రజలు చర్చించుకుంటున్నారు.