Friday, September 20, 2024
spot_img

చెరువుల ఆక్రమణల పై సమాచారం ఇవ్వండి

Must Read
  • చెరువులు,కుంటలు ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళు ఉన్న అధికారుల చర్యలు తప్పవు
  • చెరువుల అక్రమాలపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి
  • పరిరక్షణ కోసం స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలి
  • ప్రభుత్వం ఎవరి మీద కక్ష పూరితంగా,వ్యక్తిగతంగా,ఉద్దేశ్య పూర్వకంగా వ్యవహరించడం లేదు
  • ఇది ప్రజాపాలనలో భాగంగా తీసుకున్న చర్య
  • మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో ఎక్కడైనా చెరువులు,కుంటలు ఆక్రమణకు గురైతే,ఆ అక్రమాల వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే సంభందిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.శనివారం అక్రమాల కూల్చివేతల పై స్పందిస్తూ,సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు.ఈ సందర్బంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చెరువులు అక్రమాలకు గురైన,అక్కడి స్థానిక ప్రజలు ఆ సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.చెరువుల పరిరక్షణకు స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం ఎవరి మీద కక్ష పూరితంగా,వ్యక్తిగతంగా,ఉద్దేశ్య పూర్వకంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు.ఇది వ్యక్తుల మీద కానీ,పార్టీల మీద కానీ జరుగుతున్న పోరాటం కాదని,ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్య అని పేర్కొన్నారు.హైదరాబాద్ లోని చెరువుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రకృతిని భవిష్యత్తు తరానికి అందిచడం కోసం,చెరువులను కాపాడుకోవడం కోసం స్వచ్చందంగా ముందుకు రావాలని కోరారు.

Latest News

బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This