కులం అనేది నీ పాడే వెనకాల ఉత్తరాన ఉన్న వైకుంఠధామం వరకే..
ధనం అనేది నీవు చనిపోయే వరకు
తృప్తిగా చూసుకోవడానికే..
నలుపు, తెలుపు అనే నీ శరీర రంగులు కాటిలో
కట్టె కాలే వరకే..
నిన్ను కాల్చగా మిగిలిన బూడిద,
బొక్కలు గంగ పాలు..
నిన్ను పూడ్చిన శరీరం బొంద పాలు..
నువ్వు తోటి వారికి చేసిన సహాయము అనేది నిన్ను చరిత్రలో నిలపడానికి..
బ్రతికున్నప్పుడు ఎంగిలి చేత్తో కాకిని కూడా
కొట్టలేని పిసినారులం….
చనిపోయాక ఆ కాకి తిని రెండు ముద్దలే నీ ఆత్మకు శాంతిని కలిగించేది…
ఉన్నన్ని నాళ్ళు నలుగురికి మంచి చేస్తూ
హాయిగా బ్రతికేద్దాం..
ఉన్న చిన్న జీవితంలో ఈర్ష, ద్వేషాలు ఎందుకు మిత్రమ
- రమేష్ గాండ్ల