Friday, September 20, 2024
spot_img

కార్మిక శాఖలో భారీ స్కాం

Must Read

హైదరాబాద్‌ కేంద్రంగా కార్మికుల వందల కోట్లు దోచుకుంటున్నారు

  • సర్కిల్‌ 25 అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌కు కమిషనర్‌,డిప్యూటీ కమిషనర్ల అండదండలు
  • మిగిలిన జిల్లాలలోని అన్నీ లేబర్‌ క్లైమ్స్‌ హైదరాబాద్‌ సర్కిల్‌ 25 నుండే అప్రూవల్‌
  • దోచుకున్న సొమ్మును హోదాను బట్టి పంచుకుంటున్న అధికారులు
  • బీమా డబ్బుల కోసం బ్రతికున్న వ్యక్తులను చంపేస్తున్న వైనం..
  • ఆన్లైన్‌ విధానంతో ఆగమాగం చేసిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
  • జరిగిన అన్నీ లేబర్‌ క్రైమ్స్‌ 2019లోనే కావడం వెనుక పలు అనుమానాలు
  • సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే సమాచారం ఇవ్వని పెద్ద సార్లు
  • ముడుపులకు అలవాటు పడి ముఖం చాటేస్తున్న కార్మిక సంఘాల నాయకులు
  • కార్మికుల పేరుతో ఫేక్‌ కార్డులు సృష్టించి కోట్లు కొట్టేస్తున్న దగా కోర్లు
  • కరోనా మహమ్మారి కక్కుర్తి అధికారులకు వరం

దేశంలోనే కార్మికులందరికీ మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కార్మికుల బీమా చట్టాన్ని తీసుకొచ్చింది. దేశంలో పని చేస్తున్న కార్మికులకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఈ బీమా చట్టం వర్తిస్తుంది.ఈ కార్మిక చట్టం కింద కార్మికునికి ఏమైనా జరిగితే మ్యారేజ్‌ బహుమతి ( రూ.30,000),అంగవైకల్యం గిఫ్ట్‌,చనిపోయిన గిఫ్ట్‌,అంత్యక్రియల ఖర్చులు,హాస్పిటలైజేషన్‌ రిలీఫ్‌ మరియు సహజ మరణాల కింద కొంత మొత్తాన్ని నామినీకి బీమా పథకాన్ని వర్తింపజేస్తారు.ఈ కార్మిక చట్టం ఒక కార్మికుడు ఏ జిల్లాకు చెందినవాడు( ఆధార్‌ కార్డు) ఆధారంగా అయితే అదే జిల్లాల్లో బీమా కోసం అప్లై చేసుకోవాలి.ఒకవేళ బతకడం కోసం వేరే జిల్లాకు వెళ్తే,అక్కడ ఉండే అడ్రస్‌ ప్రూఫ్‌ ను ఆధారంగా చూపించుకోవాలి. ఒక కార్మికుడుకి ఆక్సిడెంట్‌ జరిగితే,జరిగిన ప్రదేశం ఆధారముగా ఆ పరిధిలో వచ్చే పోలీస్‌ స్టేషన్‌ ఎఫ్‌ఐఆర్‌ కూడా ఉండాలి.ఒకవేళ కార్మికుడి సహజ మరణం అయితే డెత్‌ సర్టిఫికేట్‌ మున్సిపాలిటీలో కానీ, గ్రామాల్లో కానీ తీసుకోవాలి. ఒకవేళ అనుకోకుండా కార్మికుడికి ఏమైనా జరిగితే,దానిని లేబర్‌ కమిషనర్‌ కు ఒక సంవత్సరంలోపే బీమా కోసం లేబర్‌ ఆఫీసర్‌ వద్ద అప్లై చేసుకోవాలి.దీనిని దర్యాప్తు చేసి వారిపై అధికారికి అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ పంపించాలి.దీన్ని మరోసారి దర్యాప్తు చేసి డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ కు పంపిస్తారు.ఈ కమిటీకి డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ నిర్ధారణ కమిటీ చైర్మన్‌ గా వ్యవహరిస్తాడు.ఈ కరోనా కంటే ముందు కార్మికుల బీమాను స్వయంగా దరఖాస్తులు చేసుకునే విధానం ఉండేది.కానీ గత తెలంగాణ ప్రభుత్వం కరొన కారణంగా స్వయంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని స్వస్తి పలికి ఆన్లైన్‌ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు.ఇదే అదునుగా చేసుకొని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు.నిజమైన కార్మికులకు దక్కాల్సిన బీమా సొమ్మును అధికారులు వాటాలుగా పంచుకుంటున్నారు.

కార్మికుల బీమా సొమ్మును కాజేస్తున్న దొంగ అధికారులు హైదరాబాద్‌ లో గల తెలంగాణ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయంలో నిత్యకృతమైంది.వాళ్ల శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా అధికారులు తయారయ్యారంటే వీరిని ఏమనాలి.జరిగిన క్లైమ్‌ లన్ని 2019 సంవత్సరం కావడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.హైదరాబాద్‌ కేంద్రంగా వందల కోట్ల కార్మికుల బీమా సొమ్మును కాజేసిన కార్మిక అధికారులు మిగిలిన జిల్లాల్లో జరిగిన క్లైమ్‌ లన్ని హైదరాబాదు నుండి అప్రూవల్‌ చేసినవే.అయితే ఈ విషయాన్ని మా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు కార్మిక శాఖ కమిషనర్‌ నుండి లేబర్‌ ఆఫీస్‌ వరకు మొఖం చాటేసిన వైనం ఇంకో పెద్ద ఆఫీసర్‌ అయితే నాలుగు సంవత్సరాల క్రితమే నా పేరు మీద బీమా కార్డు ని తయారు చేసి డబ్బులు కాజేశారు.నేనెవరు చెప్పుకోవాలి అని జర్నలిస్టుని ఎదురు ప్రశ్నిస్తున్నాడు.కమీషనర్‌ కృష్ణ ఆదిత్య మరియు డిప్యూటీ కమిషనర్‌ రాజేంద్ర ప్రసాద్‌ అండదండలతో అక్రమాలకు తెరలేపిన సర్కిల్‌ 25 అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ గతంలో ఇలాంటి అక్రమాల విషయంలోనే విజిలెన్స్‌ విచారణ ఎదుర్కోన్న లేబర్‌ ఆఫీసర్‌ నాగార్జున.ఈ విషయాన్ని మా జర్నలిస్టు లేబర్‌ అధికారిని అడగగా,అందరికీ తెలిసి,అందరం కలిసి హోదాని బట్టి పంచుకున్నాము అని చెప్పాడు.

కార్మిక అధికారులకు వత్తాసు పలుకుతున్న కార్మిక సంఘాల నాయకులు? లేబర్‌ ఆఫీసు వైపు కన్నెత్తి చూడని కార్మిక సంఘం రాష్ట్ర మరియు జిల్లా నాయకులు.దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలతో జిల్లాల వారిగా పరిశోధనాత్మక కథనాలతో మీ ఆదాబ్‌ హైదరాబాద్‌ తెలుగు దినపత్రిక దశలవారీగా వెలుగులోకి తీసుకొస్తాం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తే,కక్కుర్తి అధికారులకు మాత్రం వరంగా మారింది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This