Friday, September 20, 2024
spot_img

ఆదాబ్‌ ఎఫెక్ట్‌..!

Must Read
  • స్పందించిన అధికార యంత్రాంగం…
  • గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు…
  • డిపిఓ ఆదేశానుసారంగా జిపిలో
  • శానిటేషన్‌ వర్క్‌ తూతూ మంత్రంగా పని పూర్తి

జాడ లేని వైద్య శిబిరం ఆధాబ్‌ హైదరాబాద్‌ దిన పత్రికలో ప్రచురితమైన కథ నంతో జిల్లా మండల వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో సంబంధిత అధికారులు స్పందించారు.

సోమవారం బోజేర్వు గ్రామంలో వీధులను పరిశీలించి విష జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలు తెలుసుకున్నారు.చెన్నారావుపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు బోజేర్వు గ్రామంలో వైద్య శిబిరా న్ని ఏర్పాటు చేశారు.వైద్యాధికారి డాక్టర్‌ సరోజ ఆధ్వర్యంలో డా.భవాని తన బృందంతో కలిసి రోగులను పరీక్షించి మందులు అందించారు.అదే విధంగా రోగుల నుండి రక్త నమూనా లను సేకరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా డిపిఓ ఆదేశాల మేరకు బోజేర్వు శానిటేషన్‌ వర్క్‌ తూతూ మంత్రంగా కొనసాగింది.ఎక్కడి పనులు అక్కడే.ఒక 100 మీటర్ల దూరంలో శానిటేషన్‌ వర్క్‌ జరిగింది.ఎక్కడి గడ్డి అక్కడే తీసి వేసిన కుప్పలు కూడా అక్కడే ఉన్నాయి.పాపయ్యపేట గ్రామపంచాయతీ నుండి తీసుకొని బోజేర్వు వచ్చిన దౌర్భాగ్యం మరి బోజేర్వు జిపి ట్రాక్టర్‌ ఉందన్న విషయాన్ని కూడా మరిచారు.అధికారులు గ్రామానికి సందర్శించి బోజేర్వు జిపి ట్రాక్టర్‌ ని యధావిధిగా రోజు నడిచే విధంగా మరియు శానిటేషన్‌ వర్క్స్‌ ప్రతిరోజు జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.అదేవిధంగా డాక్టర్‌ భవాని మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు ప్రభలుతున్న తరుణంలో ఇండ్లలో,కూలర్లులో నీటి నిలువ ఉంచవద్దని,అవి దోమలకు ఆవాసంగా ఉంటాయని చెప్పారు. నిలువ ఉన్న నీటిని ఉంచకూడదని అన్నారు.దీంతో నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి అధికారుల దృష్టికి చేరవేస్తున్న’’ఆదాబ్‌ పత్రిక’’ పట్ల పలువురు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This