- పూజా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజేంద్ర పల్నాటి
సమాజంలో నిత్యం ఎన్నో చిత్రాలు వస్తుంటాయని,కాని సమాజంలో జరుగుతున్న ఘటనల పై ప్రజల్లో అవగాహన కల్పించే షార్ట్ ఫిల్మ్ నిర్మించడం గొప్ప పరిణామమని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి అన్నారు.బుధవారం సోమాజిగూడలోని షార్ట్ ఫిల్మ్ పూజ ప్రారంభించారు.సమాజంలోని జరిగే అఘాయిత్యాలపై ఈ షార్ట్ ఫిల్మ్ ఉండబోతుందని దర్శకుడు శివనాగరాజు తెలిపారు.ఒక మహిళ వైద్యురాలికి,ఉన్మాదులకు మధ్య జరిగే సన్నివేశాలే ఇందులో ఉండబోతున్నాయన్నారు.ఈ సినిమాను రమేష్‌బాబు కోమటి నిర్మిస్తున్నారు. ఈ నూతన షార్ట్ ఫిల్మ్ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ బృందం దేవేందర్ కొన్నె,ప్రదీప్ రెడ్డి,బత్తిని రాజేష్,హిరోయిన్ హేమ పెదకోట,ఎడిటర్ కేతన్ కంచర్ల,కెమెరామెన్ నవీన్ కుమార్ పొన్నాల,కలరింగ్ రామోజు మణికంఠ,అసిస్టెంట్ డైరెక్టర్ జాఫర్ వలీ,వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.