దేశవ్యాప్తంగా కోల్ కతా వైద్యురాలి హత్యాచార ఘటన సంచలనంగా మారింది.దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.మరోవైపు మమతా బెనర్జీ సర్కార్ పై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కేసులో పురోగతి కనిపించడం లేదని విమర్శిస్తున్నాయి.
తాజాగా ఈ ఘటన పై వైద్యురాలి తల్లి స్పందించారు.మమతా బెనర్జీ సర్కార్ పై అసహనం వ్యక్తం చేశారు.నిరసనలకు వ్యతిరేకంగా సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తనకు నచ్చలేదని,తమ కుమార్తె పై జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా వైద్యులు,విద్యార్థులు తదితరులు పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు.తమ కుమార్తెకు ప్రపంచం మొత్తం అండగా నిలుస్తుందని అన్నారు.బిడ్డను కోల్పోయి ఉన్న తమను మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు చేసిన ఇంకా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఆమెకు పిల్లలు ఉంటే ఈ బాధ తెలిసేదని వ్యాఖ్యనించారు.