Thursday, November 21, 2024
spot_img

న్యాయవాదులపై దాడులు అనైతికం..!

Must Read

అవును తెలంగాణ రాష్ట్రంలో వరసగా న్యాయవాదులపై ఏదో ఒక ప్రాంతంలో వరసగా దాడులు జరుగుతున్నాయి.అటు జూనియర్ మరియు సినియర్ న్యాయవాదుల అంటూ తేడా లేకుండా అటు పోలీసులు,సివిల్ వ్యక్తులు దాడులు చేయడం చట్ట విరుద్ధం చెప్పవచ్చు.ఇటీవల కాలంలో వరంగల్ జిల్లా జనగాం అనే ప్రాంతంలో ఒక కేస్ విషయంలో న్యాయవాదులు మాట్లాడడానికి పోలీసు స్టేషన్ కి వెళ్తే అక్కడ ఉన్న సీఐ అతి దురుసుగా ప్రవర్తించిన తీరు మనమందరం చూశాం.గల్లా పట్టుకొని మరి కొట్టిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఒక బాధ్యత గల సీఐ అన్ని తెలిసిన న్యాయ నిపుణులపై చెయ్ చేసుకుంటే మరి సామాన్య మానవుని పరిస్థితి ఎంటి? రాష్ట్రంలో మరో సంఘటన కూడా బాధాకరంగా అనిపించింది.హైదరాబాద్ బొరబండ అనే ప్రాంతంలో తెల్లవారుజామునే ఒక ఎస్సై న్యాయవాది సంతోష్ పై తీవ్రంగా విరుచుకుపడి అరెస్టు చేసి,కుటుంబ సభ్యుల ముందే తీసుకెళ్లినా ఘటన చూశాం! పోలీసులు తీరుపై న్యాయవాదులు ప్రొటెస్ట్ చేయడం జరిగింది.క్రింది స్థాయి పోలీస్ అధికారుల తీరుపై అందరూ అసహనం వ్యక్తం చేశారు.

దాడులు అనైతికం:

ఒక పక్క పోలీసులు,మరో పక్క సివిల్ వ్యక్తులు న్యాయవాదులు పై దాడి చేయడం,అనైతికంగా చెప్పవచ్చు.ప్రధానంగా కాక్షిదారులు కేసులు విషయంపై పూర్వాపరాలు తెలుసుకొని మాట్లాడుకోవాలి.లేకపోతే కేసులు పెట్టుకోవాలి! అంతె కానీ దాడులు హే పరిష్కారం కాదు కదా! ఒక న్యాయవాది న్యాయాన్ని రక్షించే క్రమంలో క్లయింట్ కి న్యాయం కోసం మాత్రమే పోరాటం చేసే వ్యక్తిగా చూడాలి! న్యాయవాది కూడా సర్వీస్ మోటోలోనే పని చేయడం జరుగుతుందని భావించాలి.అంతె తప్ప,ప్రత్యర్థి వ్యక్తులు న్యాయవాదులపై దాడి చేయడం, అందరం న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించడమే అవుతుంది.న్యాయవాది సమాజంలో ఉన్నతంగా వుండే వ్యక్తి, న్యాయవాదులు లేకపోతే వ్యవస్థ అతలాకుతలం అవుతుంది అని చెప్పుకోవచ్చు.కాబట్టి అటు వ్యవస్థలో ఉన్న ఎవరైనా దాడులు చేయడం అనైతికంగా చెప్పవచ్చు.కొందరి న్యాయవాదుల వల్ల ఎంతో మందికి అప్రతిష్ఠ వస్తుంది అనాలి! బాధితులు కూడా న్యాయవాది నీ ఎంచుకునే క్రమంలో ఆలోచన చేయాలి.మీ సమస్య పై పూర్తిగా వివరణ ఇవ్వాలి! తప్పుడు కేసులు ఇవ్వకూడదు.న్యాయవాది నిజంగా ప్రాక్టిస్ చేస్తున్నాడా! లేదా అని చూసుకోవాలి.అలాంటప్పుడు అటు బాధితులు మరియు న్యాయవాదులు ఇబ్బందులు పడకుండా ఉంటారు. మనమందరం గమనించాలి.కొందరి ఫేక్ న్యాయవాదుల వల్ల,న్యాయవాదుల అందరికీ చాలా ఇబ్బందులు వస్తున్నాయి.అటు బార్ అసోసియేషన్ లు కూడా దృష్టి పెట్టాలి లేకుంటే ఇవన్నీ అరికట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు.

న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి:

మూడేళ్ల క్రితం అంటే 2021 లో కేంద్ర ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2021 బిల్ ను రూపొందించి, ఆదే ఏడాది శీతాకాల
సమావేశాలలో బిల్లును పార్లమెంట్ లో ఆమోదం కోసం పెట్టాలని అన్నారు, కానీ దానిని మరలా పట్టించుకున్న వారు లేరు,నేటికీ మూడేళ్లు అయిన యాక్ట్ కి ఆమోదం లేదు! పోయినా ఏడాది రాజస్థాన్ ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అసెంబ్లీ లో పెట్టీ ఆమోదం తెలిపింది, దేశంలో మొట్టమదటిసారిగా అడ్వకేట్ యాక్ట్ తెచ్చిన మొదటి రాష్ట్రం గా నిలిచింది.దేశ వ్యాప్తంగా యాక్ట్ నీ వెంటనే అమలు చేసే విధానం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్వకేట్ యాక్ట్ పై చొరవ తీసుకొని న్యాయవాదులకు న్యాయం చేసే విధానం చేయాలి, అయితె ఈ యాక్ట్ ప్రకారం ముఖ్యంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి అందులో ఒక న్యాయవాది నీ అరెస్టు చేయాలంటే కనీసం మేజిస్ట్రేట్ అనుమతి కావాలి, అందులో డీఎస్పీ స్థాయి అధికారి మాత్రమే అరెస్టు చేసే విధంగా ఉంది, అదేవిధంగా ప్రతి ఒక్క సినియర్ మోస్ట్ అడ్వకేట్ లకు వ్యక్తిగతంగా రైఫిల్ ఇచ్చే విధంగా బిల్ లో ఏర్పాటు చేయాలి, ఒక సీనియర్ మోస్ట్ లాయర్ కూడా జడ్జి ర్యాంక్ అని చెప్పాలి, కాబట్టి తెలంగాణ రాష్ట్రం వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి అని కోరుకుందాం!ఏదీ ఏమైనప్పటికీ సమాజం లో ఉండే నోబుల్ ప్రొఫెషన్ అయిన న్యాయవాది వృత్తి పై అందరూ నమ్మకంగా ఉండాలి,అటు న్యాయవాదుల పై దాడులు చేయడం సమాజంలో అ నైతికం అని అందరు భావించాలి,అందరూ న్యాయం ను గెల్పించాలి.జై హింద్

  • కిరణ్ ఫిషర్ అడ్వకేట్
    సెల్:7989381219
Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS