Friday, September 20, 2024
spot_img

ఏ.ఎస్ రావు నగర్‌లో “సఖి” నూతన స్టోర్ ప్రారంభం

Must Read

హైదరాబాద్ లోని ఎ.ఎస్.రావు నగర్ నడిబొడ్డున “సఖి” ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ కొత్త స్టోర్ ప్రారంభమైంది.ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ అతిధులు శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద గిరి స్వామి,రామారావు,బి వెంకట భార్గవ మూర్తి,నడుపల్లి నాగశ్రీ,మేఘన రామి,ఐడ్రీమ్ అంజలి,దీపికా రంగారావుతో పాటు యాంకర్ లాస్య మంజునాథ్ హాజరయ్యారు.సఖి,ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ భారతీయ వస్త్రాలు,ఫ్యాషన్ యొక్క మహోన్నత వారసత్వాన్ని ప్రదర్శించడానికి నూతన ప్రమాణాలను ఏర్పాటు చేసింది.ఈ స్టోర్ సంప్రదాయం విశిష్టతతో పాటు సమకాలీన సౌందర్యంతో ఆకర్షణీయమైన సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుంది.ముఖ్యంగా ప్రతి ఫ్యాషన్ ఔత్సాహికుల కోరికలను తీర్చడానికి చీరలు,సౌందర్య ఉపకరణాల అద్భుత సేకరణను అందిస్తుంది.చీరల శ్రేణిలో ప్రత్యేకమైన బ్రైడల్ కలెక్షన్,ఫ్యాన్సీ,డిజైనర్ చీరల సేకరణతో పాటుగా మంగళగిరి చీరలు,మాస్టర్ డిజైన్‌లతో కూడిన కంచి పట్టు చీరలు,ఆర్గాన్జా చీరలు,బనారసీ చీరలు,పైథాని, గడ్‌వాల్ చీరలు,కాటన్ లు ఉన్నాయి.ఇక్కడ చీరల ధరలు అందరికీ అందుబాటులో రూ .695 నుంచి 2,00,000 వరకు ఉంటుంది.
లాంచ్‌కు హాజరైన అతిథులు సఖి,ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్‌ ప్రోత్సాహాన్ని,మద్దతును తెలిపారు.ఎ.ఎస్ రావు నగర్ స్టోర్ హైదరాబాద్‌లో 3వ బ్రాంచ్.ఈ కొత్త స్టోర్ భారతీయ వస్త్రాలు,హస్తకళా నైపుణ్యం యొక్క కాలాతీత సౌందర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.నేటి ఫ్యాషన్ ప్రేమికుల వైవిధ్యమైన అభిరుచులకు అనుగుణంగా ఇక్కడి సేకరణ సంప్రదాయం-ఆధునికత కలయికగా ఉంది.ఈ ప్రారంభోత్సవం సందర్భంగా సఖి,ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ వ్యవస్థాపకులు రావులపల్లి దుర్గా చంద్రశేఖర్,రావులపల్లి సాయికృష్ణ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మా కొత్త స్టోర్‌ను ప్రారంభించినందుకు అతిథులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.నూతన స్టోర్‌కి విచ్చేసి అన్ని రకాల భారతీయ నేత వస్త్రాలు,ఫ్యాన్సీ చీరలు,ప్రత్యేకమైన మ్యారేజ్ కలెక్షన్ లో ఈ అభిరుచులకు తగిన వస్త్రాలను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు.ఈ గ్రాండ్ ఓపెనింగ్ ఈవెంట్‌కు ఫ్యాషన్ ప్రియులు,స్థానిక ప్రముఖులతో సహా విభిన్నప్రేక్షకులు హాజరయ్యారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This