హైదరాబాద్ లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు.ఓ నగల వ్యాపారి వద్ద నుండి ఏకంగా రూ.35 లక్షలు కాజేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,తిబర్మల్ జ్యువెలర్స్ మేనేజర్ శ్రీకాంత్ బంజారాహిల్స్ లో దుకాణం మూసివేసి ద్విచక్రవాహనం పై ఇంటికి బయల్దేరాడు.ఈ క్రమంలోనే రేతిబౌలి వద్ద ఆగగా,బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు అతని వద్ద ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు.వెంటనే బాధితుడు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.