తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు జిల్లాలోని వాగులు,వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్,ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది .ఆదిలాబాద్,నిర్మల్,నిజామాబాద్,కామారెడ్డి,మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్,వనపర్తి,నారాయణపేట,గద్వాల జిల్లాలకు రెడ్ అలెర్ట్.. కొమురంభీం,మంచిర్యాల,జగిత్యాల,ములుగు,జయశంకర్,ఖమ్మం,భద్రాద్రికొత్తగూడెం,వరంగల్,హన్మకొండ,జనగామ,వికారాబాద్,సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది వాతావరణశాఖ.
రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.మరికొన్ని రైళ్లను దారి మళ్ళించింది.భారీ వర్షాల కారణంగా పలు చోట్ల రైలు పట్టాలు దెబ్బతిన్నాయి.దింతో రైల్వే శాఖ 30 రైళ్లను రద్దు చేసింది.
హైదరాబాద్ లో భారీ వర్షాలు,రెడ్ అలెర్ట్ జారీ :
హైదరాబాద్ నగరం గత రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలతో తడిసిముద్దయింది.శుక్రవారం అర్ధరాత్రి నుండి హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది.శనివారం కూడా నగరంలో భారీ వర్షం కురిసింది.ఆదివారం ఉదయం నుండి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది.మరోవైపు హైదరాబాద్ కు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ చేసింది.దింతో జీహెచ్ఎంసి అప్రమత్తమైంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు.ఆస్తి ప్రాణనష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.