- ఏపీ సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో చెత్త రాజకీయాలు చేయవద్దని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.అనంతరం విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు.వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న వారి సమస్యలను దూరం చేయడానికి సాయశక్తుల కృషి చేస్తున్నామని తెలిపారు.ఇలాంటి సమయంలో బాధితులను అధికారులు తమ కుటుంబసభ్యులుగా భావించాలని కోరారు.చివరి బాధితుడి వరకు సాయం అందేలా చూస్తున్నామని స్పష్టం చేశారు.వరద బాధితుల బాధలను అర్థం చేసుకున్నానని వెల్లడించారు.కొంతమంది ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు చెత్త రాజకీయాలు చేయవద్దని సూచించారు.జగన్ ఐదు నిమిషాల కోసం వచ్చి షో చేసి వెళ్లారని,ఒక్కరికైనా ఆహార పొట్లంను అందించార అని ప్రశ్నించారు.
ఆపద సమయంలో గుడ్లవల్లేరులో జరిగిన ఘటనపై ఫోకస్ పెడతార అని మండిపడ్డారు.