Thursday, November 21, 2024
spot_img

టీమిండియాలో పెద్ద ఎత్తున రాజకీయాలు

Must Read
  • కేఎల్‌ రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు!

టీ20 ప్రపంచకప్‌ 2024 ముగిసిన తర్వాత టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ముగుస్తుంది. నివేదికల ప్రకారం ద్రవిడ్‌ మరోసారి కోచ్‌గా కొనసాగడానికి ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. దాంతో కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ వెతుకుతోంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించగా.. మే 27 ఆఖరి గడువు. హెడ్‌ కోచ్‌ పదవిని బీసీసీఐ ఎవరితో భర్తీ చేస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతానికి కోచ్‌ రేసులో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, జస్టిన్‌ లాంగర్‌, రికీ పాంటింగ్‌, గౌతమ్‌ గంభీర్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే టీమిండియా కోచ్‌ పదవిపై విదేశీ మాజీలు పెద్దగా ఆసక్తి చూపించట్లేదట. అందుకు కారణాలు లేకపోలేదు. టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా ఉంటే.. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపలేమని రికీ పాంటింగ్‌ చెప్పాడు. స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ కూడా అదే కారణం చెప్పాడు. అయితే లక్నో సూపర్‌ జెయింట్స్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ చెప్పిన కారణం మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపడితే.. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తనకు చెప్పాడని ఓ బాంబు పేల్చాడు. భారత జట్టులో ఐపీఎల్‌ కంటే వెయ్యి రెట్ల ఒత్తిడి, పాలిటిక్స్‌ ఉంటాయని రాహుల్‌ తనకు చెప్పాడని లాంగర్‌ పేర్కొన్నాడు.బీబీసీ స్టంప్డ్‌ పాడ్‌కాస్ట్‌లో ఆస్ట్రేలియా మాజీ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మాట్లాడుతూ%ౌ% ‘భారత జట్టు కోచ్‌ పదవి అద్భుతమైనది. కానీ నేను పోటీలో ఉండట్లేదు. టీమిండియా కోచ్‌ పదవి అందరినీ ఆకట్టుకునే పాత్ర అని నాకు తెలుసు. ఆస్ట్రేలియా జట్టుతో నాలుగేళ్లు పని చేశా. నిజాయితీగా చెప్పాలంటే నేను చాలా అలసిపోయా. భారత జట్టులో అధిక ఒత్తిడి ఉంటుంది. నేను కేఎల్‌ రాహుల్‌తో మాట్లాడాను. ‘ఐపీఎల్‌లో ఒత్తిడి, రాజకీయాలు ఉన్నాయని మీకు తెలుసు. దానికి వెయ్యి రెట్లు అక్కడ ఉంటుంది’ అని రాహుల్‌ చెప్పాడు. ఇదో మంచి సలహా. టీమిండియా కోచ్‌ మంచి జాబే, కానీ నాకు కాదు’ అన్నాడు. రాహుల్‌ చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి.

Latest News

భారతదేశం గర్వించదగిన శాస్త్రవేత్త సి.వి.రామన్

(నవంబర్ 21 న వర్ధంతి సందర్భంగా) నా మతం సైన్స్, నేను సైన్స్ నే పూజిస్తాను, ప్రేమిస్తాను నా బతుకు అంత సైన్స్ అన్న మహానుభావుడు సి.వి.రామన్.ఎన్నో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS