- హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైడ్రా పేరు చెప్పి ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.మంగళవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ చెందిన విప్లవ్,తనను డబ్బుల కోసం బెదిరిస్తున్నదంటూ ఓ బిల్డర్ హైడ్రా కమిషనర్ కి ఫిర్యాదు చేశాడు.హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి ఎస్పీ ఫిర్యాదు స్వీకరించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు విప్లవ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.హైడ్రా పేరుతో ఎవరైనా బెదరింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకోరావాలని తెలిపారు.బిల్డర్లను హైడ్రా పేరుతో కొంతమంది కేటుగాళ్లు బెదిరిస్తున్నరని,హైడ్రాలో కొంతమంది అధికారులతో పరిచయాలు ఉన్నాయని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు.ప్రభుత్వ విభాగంలో కూడా ఎవరైనా అధికారులు బెదిరింపులకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.హైడ్రా పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడితే నేరుగా జైలుకే పంపిస్తామని హెచ్చరించారు.