రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఎన్టీఆర్,పల్నాడు,ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..గుంటూర్,కృష్ణ,కోనసీమ,పశ్చిమ గోదావరి,తూర్పు గోదావరి,కాకినాడ,అనకాపల్లి,విశాఖపట్నంతో పాటు సీతారామరాజు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ చేసింది.ఉత్తరాంధ్రలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళొదని సూచించింది.మరోవైపు పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుండి భారీ వర్షాలు కూరుస్తాయని తెలిపింది.ఈ నేల 06వరకు దక్షిణ కోస్తాలో,08 వరకు ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కూరుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.