Wednesday, December 4, 2024
spot_img

తెలంగాణలో కుంభకోణాల కుంభమేళా..

Must Read
  • గల్లీ మే లూఠో.. ఢిల్లీ మే బాఠో” అన్నట్లుగా పరిస్థితి తైయారైంది
  • జేబులు నింపుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ
  • బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే స్కీమ్‌లు, కాంగ్రెస్‌ అంటే స్కామ్‌లు
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ ర‌కాల టాక్స్ లు
  • కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కేటీఅర్

కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు.ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో కుంభకోణాల కుంభమేళా జరుగుతందని , అయితే ఈ విషయాన్ని తాను ఎన్నికలకు ఆరు నెలల ముందు నుండే చెప్పుకుంటు వస్తున్నాని గుర్తుచేశారు.” గల్లీ మే లూఠో.. ఢిల్లీ మే బాఠో” అన్నట్లుగా పరిస్థితి తైయారైందని, రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థులు తినే అన్నం వరకు అన్నిటి మీద కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని విమర్శించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ 15 రోజుల కిందటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్దిష్ట ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. అయిన ఈ విషయం పై ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. వారం రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ఈ ఆరోప‌ణలను ఆధారాలతో సహా బయటపెట్టారని వెల్లడించారు. ఇప్పటివరకు కుంభకోణం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ నోరువిప్పలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే స్కీమ్‌లు, కాంగ్రెస్‌ పార్టీ అంటే స్కామ్‌లు అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. తెలంగాణలోని రైతాంగం కొనుగోలు కేంద్రాల వద్ద కన్నీరు పెడుతుంటే ప్రభుత్వం మాత్రం ధాన్యం కుంభకోణం పై దృష్టి పెట్టిందని విమర్శించారు. ముఖ్యమంత్రి పేషీ, పౌరసరఫరాల డిపార్ట్‌మెంట్‌ నుంచే ఈ కుంభకోణం జరిగినట్టు తన వద్ద సమాచారం ఉందని వెల్లడించారు. ప్రభుత్వం ఖజానాకు గండి కొట్టి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక వివిధ టాక్స్ ల గురించి వింటున్నామని, అయితే ఈ స్కాంల వెనుక తెలంగాణ కాంగ్రెస్ పెద్దల హస్తం కాకుండా ఢిల్లీ పెద్దల హస్తం కూడా ఉందని విమర్శించారు. తమ జేబులు నింపుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారని ఆరోపించారు.

Latest News

శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS