Friday, September 20, 2024
spot_img

పారిశుద్ధ్య కార్మికులకు టార్చర్

Must Read
  • ఎస్ఎఫ్ఏ ఖాసీఫ్ అహ్మద్ అరాటకం
  • జీహెచ్ఎంసీ సౌత్ జోన్ లో కే ట్యాక్స్
  • సర్కిల్ 7లో కార్మికులకు మానసికంగా వేధింపులు
  • సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అరాచకాలపై పీఎస్ లో కంప్లైంట్
  • స్త్రీలని చూడకుండా బూతులు తిడుతున్న వైనం
  • మహిళలను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు
  • గతంలో ఇదే తీరు.. ఫిర్యాదు చేయడంతో విధుల నుంచి తొలగింపు
  • ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తిరిగి విధుల్లోకి
  • మళ్లీ మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఖాసీఫ్

జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న మహిళలను ఓ ఉద్యోగి టార్చర్ పెడుతున్నాడు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని సౌత్ జోన్ సర్కిల్ 7లో పనిచేసే కార్మికులను ఎస్ఎఫ్ఏ గా కాంట్రాక్ట్ పద్దతిలో విధులు నిర్వర్తిస్తున్న ఖాసీఫ్ అహ్మద్ లైంగికంగా వేధిస్తున్నాడు. తలాఖ్ కట్ట పరిధిలో 21 మంది కార్మికులు పనిచేస్తుండగా… ఆయన ఇంఛార్జీగా ఉన్న ఎస్ఆర్.టి నగర్ లో మరో 14మంది పారిశుద్ధ్య కార్మికులు డైలీ వర్క్ చేస్తున్నారు. అయితే వీళ్లను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సైతం ఇలాగే చేసిన అతడిపై ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయడంతో అతడ్ని ఉద్యోగంలో నుంచి తొలగించడం జరిగింది. అయితే ఆయన ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తాయని, కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బ్రతిమిలాడడంతో సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ ఖాసీఫ్ అహ్మద్ ను అధికారులు తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ‘కుక్క తోక వంకరే’ అన్న చందంగా మహిళలను వేధించడం మానలేదు. పనులు చేయడం లేదని నెపంతో మహిళలను బూతులు తిడుతూ ఇబ్బందులు గురిచేస్తున్నట్లు సదరు కార్మికులకు వాపోతున్నారు.

ఈ మేరకు తాజాగా భవానీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు సహకరించకుంటే అటెండెన్స్ వేయడం లేదని వాపోతున్నారు. ప్రతి నెలా తనకు మాముళ్లు ఇయ్యాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల పేరుతో ఖాసీఫ్ అహ్మద్ అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని డ్యూటీకి రావాలంటే కూడా భయపడిపోతున్నట్లు మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు పనికి వచ్చిన హాజరు వేయకపోవడంతో జీతం కట్ అవుతుందని తెలిపారు. అక్రమ సంపాదన ద్వారా పై అధికారులను మచ్చిక చేసుకొని వారిని తన గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నట్లు తెలుస్తోంది. దళిత, గిరిజన మహిళలను టార్చర్ పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని స్వీపర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. సౌత్ జోన్ పరిధిలోని సర్కిల్ 7 లో పనిచేస్తున్న మహిళ స్వీపర్లు, కార్మికుల పట్ల ఎస్ఎఫ్ఏ ఖాసీఫ్ అహ్మద్ లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదీ వరకు మహిళలను వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు అతడ్ని కొలువులో నుంచి తీసివేయడం జరిగింది. అయినా తిరిగి మళ్లీ అలాంటి పొరపాట్లు చేస్తు మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఖాసీఫ్ అహ్మద్ పై చర్యలు తీసుకోవాలని పలువురు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This