Friday, September 20, 2024
spot_img

గంజాయి రవాణాపై ఉక్కు పాదం

Must Read
  • గంజాయిని అరికడుతున్న పోలీసులు
  • 1035 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు
  • గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు
  • కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజ్‌ హెచ్చరిక

గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాను జిల్లా పోలీసులు సమర్థవంతంగా అరికడుతున్నారని ఎస్పీ రోహిత్‌ రాజ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయిని అక్రమంగా రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను నిర్మూలించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టిఎస్‌ఎన్‌ఎబి వారితో సమన్వయం పాటిస్తూ సమాచారాన్ని సేకరిస్తూ నిషేధిత గంజాయి రవాణాను అడ్డుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 25న జిల్లాలోని మూడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకొని భారీగా గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. భద్రాచలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కూనవరం రోడ్డులో ఆర్‌టిఎ ఆఫీస్‌ ఎదురుగా భద్రాచలం ఎస్‌ఐ విజయలక్ష్మీ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా రెండు వాహనాల్లో తరలిస్తున్న 427 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.1,06,58,000 ఉంటుందని తెలిపారు.

అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జంగారెడ్డిగూడెం రోడ్డులోని సాయిబాబా టెంపుల్‌ వద్ద ఎస్‌ఐ శ్రీనివాస్‌ తన సిబ్బందితో వాహన తనిఖీలో ఒక బొలోరో వ్యాన్‌లో నలుగురు వ్యక్తులు పనసకాయల లోడులా భావించే విధంగా వెనుక భాగంలో 359కేజీల గంజాయిని దాచిపెట్టి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దారకొండ, అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి హైద్రాబాద్‌కు తరలిస్తుండగా పట్టుకున్నారని వివరించారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.89లక్షలు 83వేలు ఉంటుందని తెలిపారు. అశ్వాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎస్‌ఐ తిరుపతి తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు నుండి ప్రత్యేకంగా ఒక ప్రైవేట్‌ బస్సులో వెనుక లగేజీ క్యాబిన్‌ లోపల, బస్సు సీట్ల కింద 249 కేజీల గంజాయిని అమర్చి హైద్రాబాద్‌కు తరలిస్తుండగా అశ్వాపురం పోలీసులు పట్టుకున్నారని దీని విలువ సుమారు రూ.62,07,500 ఉంటుందని తెలిపారు. ఈ మూడు ఘటనల్లో సుమారు 1035 కేజీల గంజాయిని పట్టుకున్నారని వివరించారు. వీటి విలువ సుమారు రూ.2,58,48,500 ఉంటుందని ఎస్పీ తెలిపారు. గంజాయి స్వాధీనం చేస్తున్న వాహనాలకు సీజ్‌ చేసి ఆ వ్యక్తులను అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పేర్కొన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This