- అనుమతి లేకుండా
నాలుగు అక్రమ భవన నిర్మాణాలు… - గుత్తాధిపతి బిల్డర్ కహానీపై
ప్రజావాణిలో ఫిర్యాదు.. - స్పందించిన జోనల్ కమిషనర్
అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని హామీ - అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తారా..!
కాలయాపన చేస్తారా..! - బిల్డర్‌కి ఒక చట్టం, సామాన్యుడికి
ఒక చట్టమా? - చట్టం తన పని తాను చేసుకుంటూ
పోతుందా ?
ప్రభుత్వాన్ని,చట్టాన్ని సవాల్ చేస్తూ మోనోపాలి..లా వ్యవహరిస్తున్న బిల్డర్ కహాని ఇది..ఒక మొండోడు మహారాజు కంటే బలవంతుడిగా వుంటాడన్నది సామెత ..అయితే ఇప్పుడు చెప్పుకుంటున్న కథలో ఈ బిల్డర్ ఒట్టి మొండోడు కాదు..నియంత కూడా.ఇతగాడిని చూసి మోనోపాలి ఆన్న పదమే సిగ్గుతో కుంచించుకు పోతుంది..వివరాల్లోకి వెళ్తే..
ఎల్బీనగర్ జోన్ లో అక్ర మ నిర్మాణాలకు ఏ మాత్రం అడ్డు,అదుపు లేకుండా పోయింది…కొందరు ప్రభుత్వ నియమ,నిబంధనలు మాకు ఏ మాత్రం వర్తించవు అంటూ తమ ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలను నిర్మిస్తున్నారు..టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలపై నోటీసులు ఇచ్చి కూల్చివేయ కుండా కాలయాపన చేస్తున్నారు..అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎన్నో అవినీతి ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి.హయత్ నగర్ సర్కిల్ – 3లో ఏ.సి.బి. దాడుల్లో,ఇద్దరు టౌన్ ప్లానింగ్ సిబ్బంది పట్టు బడ్డారు..అయినా ఏ మాత్రం తగ్గేదే లేదు అంటూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు..బి.ఎన్.రెడ్డి డివిజన్,సాగర్ కాంప్లెక్స్ రోడ్డు నెంబర్ 6, సర్వే నెంబర్ 200/1 లో, ఓ బిల్డర్ ప్రభుత్వం నుండి ఏ లాంటి అనుమ తులు లేకుండా విలాసవంతమైన నాలుగు అక్రమ భవనాలు నిర్మిస్తున్నాడు..ఈ అక్రమ నిర్మాణాలపై డిప్యూటీ కమీషనర్,జోనల్ కమిషనర్ కు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది.. అక్రమ నిర్మాణాలపై ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రికలో వరుస కథనాలు ప్రచురించడం జరిగింది..అక్ర మ నిర్మాణాల కథనాలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి టౌన్ ప్లానింగ్ అధికారులకు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు… ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరిస్తూ కాలయాపన చేస్తున్న డిప్యూటీ కమిషనర్, ఏ.సి.పి, టౌన్ ప్లానింగ్ సిబ్బంది.. బిల్డర్ కు, పరోక్షంగా సహకరిస్తున్నారు.. ఈ అక్రమ నిర్మాణాలపై సెప్టెంబర్ 09/ 2024 సోమవారం రోజున ప్రజావా ణిలో ఫిర్యాదు చేయడం జరిగింది.. ప్రజావాణిలో ప్రభుత్వం నుండి ఎలాం టి అనుమతులు లేకుండా నాలుగు అక్రమ భవనాలు నిర్మాణంపై జోనల్ కమిషనర్ ను వివరణ కోరగా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని హా మీ ఇచ్చారు.. అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని సంబంధిత అధికా రులకు ఆదేశాలు జారీ చేశారు.. జోనల్ కమిష నర్ ఆదేశాలను పాటి స్తారా..? లేక కాలయాపన చేస్తారా..? బిల్డర్ కి ఒక చట్టం.. సామాన్యు డికి ఒక చట్టమా..?? అక్రమ భవన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను డిమాండ్ చేస్తున్నారు.. మోనోపాలి, లా వ్యవహరిస్తున్న బిల్డర్ అక్రమ నిర్మా ణాలు కూల్చివేసి టౌన్ ప్లానింగ్ అధికారులు తమ నిజాయితీ, నిబద్ధతను చాటుకుంటారా..? మోనోపాలి (బిల్డర్) కథ కంచికి చేరుతుందా..? ఇది కూడా మరుగున పడే అంశంగా మారిపోతుందా..? ఈ వ్యవహారంపై మరో కథనంతో మీ..ముందుకు వస్తాం..
ముఖ్యాగమనిక ఏమిటంటే…సర్వే నెంబర్ 200/ 1, సర్వే నెంబర్ ప్రోబిటెడ్ లో ఉండటం గమనార్హం