Thursday, September 19, 2024
spot_img

అనుమతులు ఒక తీరు,నిర్మాణం చేసేది మరో తీరు..

Must Read

-పర్మిషన్‌ లేకుండానే సెల్లార్‌ నిర్మాణం
-టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నోటీస్‌ ఇచ్చిన పట్టించుకోని బిల్డర్‌..
-సికింద్రాబాద్‌,పద్మారావు నగర్‌ పార్క్‌ పక్కనే అక్రమ నిర్మాణం..

నాది కాదులే,నా అత్త గారు సొమ్ము కదా అన్నట్టుగా తెలంగాణలో ప్రభుత్వ అధికారుల పనితీరు కనపడుతుంది. ఓ వైపు ప్రభుత్వ భూముల కబ్జాలు,చెరువులు,కుంటలు,నాలాలు ఆక్రమిస్తుండగా మరోవైపు అక్రమ నిర్మాణాలు,పర్మిషన్‌ లేకుండా బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తున్న సంబంధిత ఆఫీసర్లు ప్రేక్షక పాత్ర వహిస్తుండడమే ఇందుకు నిదర్శనం. అక్రమ నిర్మాణాలు, అనుమతులు ఒకటి తీసుకొని మరొకలా బిల్డింగ్‌ కన్‌ స్ట్రక్షన్‌ చేస్తున్న పట్టించున్న దాఖలాలు కానరావట్లేదు. అక్రమ నిర్మాణాలకు కొందరు ప్రభుత్వ అధికారులు సైతం అండగా నిలువడం గమనార్హం. సికింద్రాబాద్‌లోని పద్మరావు నగర్‌ పార్క్‌ పక్కనే ఓ బిల్డర్‌ తీసుకున్న అనుమతులకు విరూద్దంగా అక్రమంగా సెల్లార్‌ నిర్మాణం చేపట్టడం జరిగింది. జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు సెల్లార్‌ నిర్మాణానికి ఎలాంటి అనుమతలు లేవని, వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలని నోటీసులు జారీ చేసిన పట్టించుకోకుండా బిల్డర్‌ యదేచ్ఛగా అక్రమ నిర్మాణం చేస్తుండడం గమనార్హం. జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. బ్రిల్డర్లు అనుమతులు ఒకలా, నిర్మాణాలు మరోలా చేపడుతున్నారు. అధికారులకు, రాజకీయ నాయకులతో ఒత్తిడులు తెచ్చి బహుళ అంతస్థులు కడుతున్నారు. మున్సిపల్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అండదండలతోనే ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయని బహిరంగంగానే చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సెల్లార్‌ పర్మిషన్‌ లేకున్నా బహుళ అంతస్థుల భవనం నిర్మాణం చేపడుతున్న బిల్డర్‌ పై టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు..

Latest News

అక్టోబర్ 02 నుండి పాఠశాలలకు దసరా సెలవులు

అక్టోబర్ 02 నుండి 14వరకు దసరా సెలవులు 15న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సంధర్బంగా రాష్ట్రంలోని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు...
- Advertisement -spot_img

More Articles Like This