Thursday, September 19, 2024
spot_img

కాప్రా చెరువుకు హైడ్రా వచ్చేనా ?

Must Read
  • కాప్రా చెరువు మొత్తం విస్తీర్ణం 113
  • ఇప్పుడు మిగిలింది 60 నుంచి 70 ఎకరాలే
  • కబ్జాకు గురైన మిగితా భూమి..!
  • ఆ భూభాగాన్ని హైడ్రా తన అధీనంలోకి తీసుకోవాలి
  • ఏ విధంగా పత్రాలు సృష్టించారో అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
  • ఏ వి రంగనాథ్ కు చీత్తశుద్ది ఉంటే అక్రమ కబ్జా దారుల భారతం పట్టాలి
  • ఏవి రంగనాథ్ కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొత్తగా నిర్మిస్తున్న అంతస్తులను కూల్చేయాలి
  • కాప్రా కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఇంద్రయ్య

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా ధనికులకు ఒకలా,పేదలకు ఒకలా వ్యవహరిస్తుందని కాప్రా కాంటేస్టెడ్ కార్పొరేటర్ ఇంద్రయ్య విమర్శించారు.ఎఫ్.టి.ఎల్ కూల్చివేతలను కొనసాగిస్తారా..?? లేదా ఆపేస్తారా..? అని ప్రశ్నించారు.గ్రేటర్ హైదరాబాద్‎లోని కాప్రా సర్కిల్ లో ఉన్నటువంటి కాప్రా చెరువు మొత్తం విస్తీర్ణం 113 ఎకరాలు ఉండగా, ఇప్పుడు 60 నుంచి 70 ఎకరాలు మాత్రమే ఉంటుందని తెలిపారు.మిగితా భూమి కబ్జాకు గురైందని,అందులో కొంతమంది వెంచర్లు వేసి ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని అన్నారు.ఆ భూభాగాన్ని హైడ్రా సంస్థ అధీనంలోకి తీసుకొని,కాప్రా విస్తీరాన్ని కాపాడి,నీటి కష్టాలు లేకుండా చూడాలని కోరారు.

కాప్రా చెరువుకు నీటి ప్రభావం లేకపోవడం వల్ల దిగువన ఉన్న కాలనీల్లో 1000 నుండి 1500 ఫీట్ల మేర బోరు వేస్తే గాని నీళ్లు రాని పరిస్థితి ఉందని అన్నారు.ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, మరో బెంగళూరుగా తయారయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

చెరువుకు అనుకోని ఉన్న ఖాళీ స్థలంలో ఎలాంటి కట్టడాలు చేయవద్దని,ఖాళీ స్థలంలో ఉన్న కొంత భాగాన్ని ఎమ్మార్వో ఆధీనంలోకి తీసుకోని చుట్టుముట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.కబ్జాదారులైన పిట్టల కృష్ణా,బల్ రెడ్డి తదితరులు ఏ విధంగా పత్రాలు సృష్టించారో అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.చెరువులను సాగుబడికి ఉపయోగించాలి
కానీ,కట్టడాలు నిర్మించరాదని,అలాంటి కట్టడాలను తొలగించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు.

గతంలో కీసర మండలంగా ఉండేదని,ఇక్కడ పని చేసిన ఆర్.ఐ మల్లేష్ కుమార్ ఇప్పుడు తహసీల్దార్‎గా పనిచేస్తున్నారని వెల్లడించారు.మల్లేష్ కుమార్ నివాసం ఎఫ్.టి.ఎల్ ప్రాంతంలో ఉందని పేర్కొన్నారు.మరికొన్ని రోజులు ఇలాగే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో కాప్రా చెరువు అనేది గతంలో ఉండేదని చెప్పుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.చెరువుకు అనుకోని ఉన్న ప్రభుత్వ స్థలంలో కబ్జాదారులు బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వానికే సవాల్ విసురుతున్నారని తెలిపారు.నూతనంగా నిర్మిస్తున్న భవనాలను కూల్చేయాలని,లేనిపక్షంలో విక్రయాలు జరుగుతాయని అన్నారు.ఏవి రంగనాథ్ కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొత్తగా నిర్మిస్తున్న అంతస్తులను కూల్చేయాలని డిమాండ్ చేశారు.లంచాలకు ఆశపడి అధికారులు ఎక్కడపడితే అక్కడ అంతస్తులు కట్టుకోవడానికి అనుమతులు ఇస్తున్నారని,అలాంటి అధికారుల పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Latest News

అక్టోబర్ 02 నుండి పాఠశాలలకు దసరా సెలవులు

అక్టోబర్ 02 నుండి 14వరకు దసరా సెలవులు 15న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సంధర్బంగా రాష్ట్రంలోని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు...
- Advertisement -spot_img

More Articles Like This