Friday, September 20, 2024
spot_img

తెలుగులో ప్రమాణ స్వీకారం

Must Read
  • అమెరికాలో జడ్జి అయిన తెలుగు మహిళ
  • కాలిఫోర్నియా జడ్జిగా నియమితురాలైన జయ బాడిగ
  • జయ బాడిగ విజయవాడ మూలాలున్న తెలుగు మహిళ
  • మాతృభాషలో పదవీ ప్రమాణం చేయడంపట్ల ఆనందం

తెలుగు మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. కాగా ఆమె జడ్జిగా ప్రమాణ స్వీకారం చేస్తే తెలుగులో మాట్లాడారు. కాగా జయ బాడిగ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించారు. కాలిఫోర్నియా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు సంతతి మహిళగా నిలిచారు. తాజాగా, ఆమె ప్రమాణం స్వీకారాన్ని తన మాతృభాష తెలుగులో చేయడం ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం అంటూ పదవీ ప్రమాణం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జయ బాడిగ పదవీ ప్రమాణం వీడియోను టాలీ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. “కాలిఫోర్నియాలో తొలి తెలుగు మహిళా న్యాయమూర్తిగా నియమితురాలైన జయ బాడిగ గారికి హృదయపూర్వక అభినందనలు. ఆమె తన మూలాలను మర్చిపోకుండా, తెలుగు సంస్కృతిని, ఉప నిషత్తులను ప్రస్తావిస్తూ ఎంత ఆనందాన్ని పొందిందో చూసి థ్రిల్లయ్యాను. ఆమె నిజంగానే తెలుగు వారందరూ ఎంతో గర్వపడేలా చేసింది. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరెందరో తన బాటలో నడిచేలా స్ఫూర్తినిస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఆమె మా కుటుంబ మిత్రుడు బాడిగ రామకృష్ణ గారి కుమార్తె కావడం వ్యక్తిగతం గానూ ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది” అని చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు. బాడిగ రామకృష్ణ మచిలీపట్నం మాజీ ఎంపీ. 2004 నుంచి 2009 వరకు ఎంపీగా వ్యవహరించారు. జయ బాడిగ హైదరాబాద్ లో విద్యాభ్యాసం చేసి అమెరికాలో న్యాయశాస్త్రం పట్టా అందుకున్నారు. అమెరికాలో జడ్జి నియమితులై తెలుగులో ప్రమాణం చేయడంపట్ల తెలుగువారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This