Friday, November 22, 2024
spot_img

నేరస్థులపై పోలీస్‌ నజర్‌…!!

Must Read
  • రౌడీషీటర్ల దౌర్జన్యాల పై పోలీసుల ప్రత్యేక దృష్టి..
  • పోలీస్ స్టేషన్ కి పిలిచి కౌన్సిలింగ్‌..
  • గణేష్ నిమార్జనం,మీలాద్‌ ఉన్‌నబీ దృశ్య అప్రమత్తమైన పోలీసులు

నేరస్థులు,రౌడీషీటర్ల కట్టడికి పోలీసులు అనుసరిస్తున్న విధానంపై ఆదాబ్‌ ప్రత్యేక కథనం…!!

హైదరాబాద్ నగరం పోలీసులు గల్లీ రౌడీలు,కరుడుగట్టిన రౌడీషీటర్లు,గ్యాంగ్‎స్టార్ల భరతం పడుతున్నారు.స్టేషన్ కి పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపుతున్నారు.అంతేకాదు రాత్రి 10 దాటితే ఇంట్లో ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.స్వయంగా ఎస్సై స్థాయి అధికారులే వారి నివాసలకు వెళ్ళి వారు ఉంటున్నారో,లేదో అని పరిశీలిస్తున్నారు.ఇంట్లో ఉన్నాడని నిర్దారించుకున్నకే సంతృప్తి చెందుతున్నారు.ఒక్కసారిగా పోలీసుల వైఖరి మారడం వెనుకల నేల రోజుల క్రితం పశ్చిమ,దక్షిణ మండల పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటననే కారణంగా కనిపిస్తుంది.

కొంత మంది రౌడీషీటర్లు స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో,రౌడీషీటర్లు,నెరస్థులపై కఠినంగా వ్యవహారించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ ఆదేశించారు.గణేష్ నిమార్జనం,మీలాద్‌ఉన్‌నబీ పండుగను పురస్కరించుకొని నగరంలో ఎలాంటి ఆవాంఛనియ సంఘటనలు చోటుచేసుకోకుండా రౌడీషీటర్ల ఆగడాలకు చెక్‌ పెట్టాలని సూచించారు.జోన్ల వారిగా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. స్వయంగా సీ.వీ ఆనంద్‌,నగరంలోని అన్ని జోన్ల అధికారులతో చర్చించి,అనేక ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు.దీంట్లో భాగంగా పాతబస్తీ పై ప్రత్యేక దృష్టి సారించారు.

దక్షిణ మండల,పశ్చిమ మండల పరిధిలో రౌడీషీటర్లు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్న సమాచారం రావడంతో పేరు మోసిన రౌడీషీటర్లపై పోలీసులు దృష్టి పెట్టారు.ఇటీవలే కొంతమంది రౌడీషీటర్లు నగరం విడిచి పారిపోయినట్టు గుర్తించారు.వీరి అనుచరులు మాత్రం స్థానికంగా సెటిల్‌ మెంట్లు చేస్తు,భౌతిక దాడులకు పాల్పడుతుండంతో బాధితులు వీరికి అడిగిన మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారు.వివాదాల్లో ఉన్న స్థలలాను గుర్తించి వాటిని బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.దీనికి చక్కటి ఉదాహరణ ఇటివల నగరంలో చోటు చేసుకున్న హత్యలు.మరోవైపు స్థానిక పోలీసులతో కొంతమంది రౌడీషీటర్లకు సంబంధాలు కూడా ఉన్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి.ఈ విషయం స్థానిక డీసీపీ స్థాయి అధికారి దృష్టికి వెళ్లడంతో రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

దక్షీణమండల పరిధిలో నమోదైన రౌడీషీటర్ల వివరాలు….!!

మొత్తం రౌడీషీటర్ల సంఖ్య- 427
అనుమానితులు- 995
పీ.డీ.చట్టం ప్రయోగించబడ్డా రౌడీ షీటర్ల సంఖ్య- 34
కమ్యూనల్‌ రౌడీ షీటర్లు – 15

దౌర్జన్యాలపై నిఘా :

రౌడీషీటర్ల దౌర్జాన్యాలపై పోలీసులు నిఘా ఉంచారు.ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్న ఆంశాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు.ఉదయం నుండి రాత్రీ వరకు వారు ఎక్కడ,ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గోంటున్నారు..?? అనేదాని పైన కూడా గట్టి నిఘా పెడుతున్నారు.అనుచరులు చేస్తున్న పనులపై కూడా పోలీసులు దృష్టి సారించారు.రాజకీయ నేపథ్యం ఉన్న రౌడీషీటర్లు చేస్తున్న సెటిల్‌ మెంట్ల వివరాలను తెప్పించుకుంటున్నారు.రౌడీషీటర్ల వారి అనుచరులు ప్రధానంగా రాత్రీ వేళల్లో ఎక్కడుంటున్నారో గుర్తించి,వారిని పోలీస్‌ స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.రాత్రీ 10 గంటలు దాటిన తర్వాత రోడ్లపై కనిపించొద్దని ఆదేశిస్తున్నారు.ఇంట్లో ఉండకపోతే రాత్రంతా సెల్‌లో పడుకోవాల్సి ఉంటుదని హెచ్చరిస్తున్నారు.

దక్షీణమండల డీసీపీ స్నేహా మెహ్రా మాట్లాడుతూ,

దక్షీణమండల పరిధిలో ఏలాంటి ఆవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రతలు తీసుకుంటున్నామని తెలిపారు.సమస్యత్మాక ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో పోలీసు గస్తీ ముమ్మరం చేశామని పేర్కొన్నారు.నేర నియంత్రణ,నేరస్థుల ఆటలను కట్టడి చేస్తున్నామని తెలిపారు.అంతేకాకుండా రౌడీషీటర్లను కౌన్సిలింగ్‌ చేయడం జరుగుతుందని అన్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS