Sunday, November 24, 2024
spot_img

రేవంత్ రెడ్డి డైరెక్షన్‎లోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి జరిగింది

Must Read
  • రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినడానికి సీఎం రేవంత్ రెడ్డియే కారణం
  • హైదరాబాద్,తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు
  • గాంధీని హౌస్ అరెస్ట్ చేయకుండా,మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు
  • మాజీ మంత్రి హరీష్ రావు

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినడానికి సీఎం రేవంత్ రెడ్డియే కారణమని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.శుక్రవారం హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.పీఏసి ఛైర్మన్ అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్ళి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హరీష్ రావుతో పాటు పలుపురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.గురువారం సీపీ కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలో తన భుజానికి గాయమైందని,ఆసుపత్రికి వెళ్ళడానికి అనుమతించాలని కోరగా పోలీసులు నిరాకరించారు.కోకాపేటలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ,హైదరాబాద్,తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యనించారు.ఎమ్మెల్యే గాంధీకి బందోబస్తు ఇచ్చి దాడులు చేయించింది ఎవరు? రేవంత్ రెడ్డి,డీజీపీలు కాదా? అని ప్రశ్నించారు.గాంధీని హౌస్ అరెస్ట్ చేయకుండా,తమను హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు.పోలీసులను అడ్డంపెట్టుకొని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసినప్పుడు రేవంత్ కు,డీజీపీకి లా అండ్ ఆర్డర్ గుర్తు రాలేదా అని ప్రశ్నించారు.ఖమ్మంలో తమ పై దాడి జరిగి పది రోజులు అవుతున్న ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని అన్నారు.కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడికి కర్త,కర్మ,క్రియ అంతా సీఎం రేవంత్ రెడ్డినే అని విమర్శించారు.రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు.రాష్ట్రంలో ఎమర్జెన్సీ కన్నా దారుణంగా పరిస్థితులు తయారయ్యయని విమర్శించారు.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS