Friday, September 20, 2024
spot_img

పొన్నం సత్తయ్య అవార్డుల ప్రదానోత్సవం

Must Read
  • జీవన సాఫల్య పురస్కారం అందుకున్న చంద్రబోస్, బలగం ఫేం కొమురవ్వ
  • పొన్నం సత్తయ్య గౌడ్ కుటుంబ విలువలను కాపాడుతూ, ఉమ్మడి కుటుంబ విలువలను నేర్పించారు.
  • హాజ‌రైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, త‌దిత‌ర మంత్రులు

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య గౌడ్ 14వ వర్ధంతి కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాల (2024)ను అందజేశారు. శుక్రవారం పొన్నం సత్తయ్య గౌడ్ 14వ వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో పొన్నం సత్తయ్య గౌడ్ – 2024 జీవన సాఫల్య పురస్కారాన్ని సినీ గేయ రచయిత ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ బలగం ఫేం కొమురవ్వలకు అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు,జూపల్లి కృష్ణారావు,పొన్నం ప్రభాకర్,ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య,ఎమ్మెల్యేలు హాజరయ్యారు.ఈ సంధర్బంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ,పొన్నం సత్తయ్య గౌడ్ జీవన సాఫల్య పురస్కారం పొందిన చంద్రబోస్ బలగం ఫేం కొమురవ్వలకు శుభాకాంక్షలు తెలిపారు.పొన్నం సత్తయ్య పేరిట చారిటేబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారి కుమారులకు అభినందనలు తెలిపారు.పొన్నం సత్తయ్య గౌడ్‎కి చదువు విలువ తెలుసు కాబట్టి,చదువు రాకున్న కుమారులకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించారని కొనియాడారు. భూమి పుత్రుడు సత్తయ్య గౌడ్ పేరు మీద కవులకు కళాకారులకు సత్కరించుకోవడం అభినందనీయమన్నారు.బలగం సినిమాలో పాటలు పాడి కొమురవ్వ ఉమ్మడి కుటుంబాల విలువలు తెలిపారని,కష్టాల్లో ఉన్న కొమురవ్వకు ప్రభుత్వం నుండి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. తన జీతం నుండి తక్షణమే లక్ష రూపాయల సహాయం అందిస్తామని తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్న సందర్భంలో,కొమురవ్వ ఉమ్మడి కుటుంబంపై పాడిన పాటకు ధన్యవాదాలు తెలిపారు.వారి కుటుంబం తరుపున వరంగల్ లో కొమురవ్వకు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో కొమురవ్వ భర్తకు మంచి చికిత్స అందిస్తామని తెలిపారు.ప్రభుత్వం నుండి కొమురవ్వకు కళాకారుల పెన్షన్ ఇచ్చేలా కృషి చేస్తామని అన్నారు.

అనంతరం సాంకేతిక,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పొన్నం ప్రభాకర్ ఇంటికి అనేక సందర్భాల్లో వెళ్ళే వాళ్ళమని గుర్తుచేసుకున్నారు.మొత్తం కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కుటుంబం ఏదైనా ఉంది అంటే అది,పొన్నం కుటుంబమని కొనియాడారు.పొన్నం ప్రభాకర్ మంత్రి అయినా వారి అన్నదమ్ములు,అక్క చెల్లెళ్ల సలహాలు,సూచనలతో ముందుకు వెళ్తారని,ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలని ఆయనను చూస్తే తెలుస్తుందన్నారు. ఎక్సైజ్, పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ,పుత్రులు ప్రయోజకులు కావాలని పొన్నం సత్తయ్య దంపతులు కోరుకునేదని గుర్తు చేశారు.పొన్నం సత్తయ్య గౌడ్,ఉమ్మడి కుటుంబం సంస్కృతి సంప్రదాయాలకు నెలవు అని కొనియాడారు.

అనంతరం సినీ గేయ రచయిత,పొన్నం సత్తయ్య గౌడ్ జీవన సాఫల్య పురస్కారం గ్రహీత చంద్రబోస్ మాట్లాడుతూ,పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందనీ తెలిపారు.అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఇప్పుడు స్థానిక కళాకారులతో కలిసి అవార్డు అందుకోవడం కూడా అంతే ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,మేడిపల్లి సత్యం, సంజయ్,శ్రీ గణేష్, వీర్లపల్లి శంకర్, నాగరాజు,మేఘారెడ్డి, ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, రవాణా రోడ్స్ అండ్ బిల్డింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్,బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళభరణం కృష్ణమోహన్ రావు,వెలిచాల రాజేందర్ రావు, మాడభూషి శ్రీధర్,సీనియర్ జర్నలిస్టు దిలీప్ రెడ్డి,రచయిత్రి శ్రీ లక్ష్మి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరి కృష్, మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This