Friday, November 22, 2024
spot_img

జైలు పాలైన ఆర్టీసీ డ్రైవర్

Must Read
  • అధికారులు ఆడిన పన్నాగంలో బుక్
  • బొక్కల ఫ్యాక్టరీ యజమాని కోసం ఆఫీసర్ల ఆరాటం
  • అక్రమ రహదారిని సక్రమంగా మార్చేందుకు రైతులపై కేసులు
  • బూటకపు సర్వేతో నోటీసు లేకుండానే రైతులను పొలానికి పిలిపించి టార్చర్
  • పిల్ల బాటను రహదారిగా మార్చేందుకు కుట్ర
  • రైతులను కటకటాల్లో పెట్టడానికి వెనకాడని వైనం
  • పేదోడిని జైలుకు పంపించిన చింతపల్లి ఎమ్మార్వో విజయ్ కుమార్

‘అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి.. దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు’ అన్నట్టు డబ్బుకు కక్కుర్తి పడ్డ అధికారులు అన్నదాతల పాలిట శాపంగా మారారు. ఫ్యాక్టరీ దారి కోసం వ్యవసాయ భూమినే స్వాధీనం చేసుకొని రహదారి నిర్మించుకున్నారు. వివరాల్లోకి వెళితే… చింతపల్లి మండలం సర్వే నెంబరు 240, సుమారు వాటి పక్కన పదుల సంఖ్యలో సర్వే నెంబర్లు, వందల సంఖ్యలో పొలాలు ఉన్నాయి. అదీ తాతల ముత్తాతల నుండి కాలినడకబాటే. అయినా ఏ రైతుకు అభ్యంతరం లేకుండా అన్నదమ్ముల వలె కలసిమెలసి వారికి అనుకూలంగా దారి వెంబటి వెళ్లేవారు. అనుకోకుండా పక్క జిల్లా అయిన రంగారెడ్డి మాడుగుల మండలం అప్పరెడ్డిపల్లి గ్రామం పరిధిలో బొక్కల ఫ్యాక్టరీ పడింది. దీంతో కంపెనీకి కావలసిన రహదారి మాడుగుల మండలం నుండి అయితే చాలా దూరం అవుతుంది. ఈ నేపథ్యంలో ఒక ఆలోచన చేసి పక్కనే ఉన్న పోలేపల్లి రాంనగర్ గ్రామానికి సంబంధించిన కాలినడక బాటను రహదారిగా మార్చాలని అక్కడి అధికారులతో కలిసి కుట్ర పన్నారు. అందులో భాగంగా పనిలో నిమగ్నమై అడ్డు వచ్చిన రైతులను బెదిరిస్తూ.. అణిచివేస్తూ వచ్చారు. మరికొందరు రైతులను తన గుప్పిట్లో పెట్టుకొన్నారు. వారికి లేని ఆశలు కల్పించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తాం.. రహదారి వెంబటి వీధిలైట్లు ఏర్పాటు చేస్తాం అని సదరు యజమాని, అధికారులు మాయమాటలు చెప్పారు. ఇంకేముంది ఆ తర్వాత మీ భూముల ధరలకు రెక్కలు వస్తాయని చెప్పి అన్నదాతలను తమ బుట్టలో వేసుకున్నారు. వారినీ నమ్మబలికి అడ్డువచ్చిన కొందరు రైతులను సంబంధం లేని మండలంలో కేసులు బనాయించి అన్నదాతలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. అధికారులందరూ బొక్కల ఫ్యాక్టరీ యజమాని ఐలయ్యకే వత్తాసు పలుకుతూ రైతులను జైలు పాలు చేయడం దారుణమైన విషయం. ఈ విషయం తెలిసిన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందనే చెప్పాలి. గత నాలుగు ఏండ్లుగా అలుపెరుగకుండా పడకంటి కృష్ణయ్య.. పోరాటం చేస్తున్న బొక్కల ఫ్యాక్టరీ యజమానికే అధికారులు సపోర్ట్ చేయడం గమనార్హం. ఈ తరుణంలో కృష్ణయ్య, మరికొందరి రైతులపై ఎన్నో కేసులు నమోదు చేసి వారిని అన్నివిధాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్లను ఆర్థికంగా కృంగదీసే ప్రయత్నాలు ఎన్నో చేశారు. గత నెల 24వ తేదీన తన విధులు నిర్వహించడానికి ప్రయాణం అవుతున్న సమయంలో హఠాత్తుగా చింతపల్లి ఎమ్మార్వో విజయ్ కుమార్, ఎస్సై యాదయ్య, ఆర్ఐ యాదయ్యలు ఫోన్ ద్వారా పడకంటి కృష్ణయ్యతో మాట్లాడుతూ.. నీ పొలం సమస్య తీరుస్తాము త్వరగా మీ పొలం దగ్గరికి రావాల్సిందిగా వివరించడం మాయమాటలు చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పొలం సమస్య తీర్చడమేందని ఆలోచించకుండానే సరే ఉన్నతాధికారులే వచ్చి నా సమస్యను తీరుస్తున్నారు అని అక్కడికి వెళ్లడంతో అసలు కథ అక్కడే మొదలైంది. బొక్కల ఫ్యాక్టరీ యజమాని కొడుకు తన బామ్మర్దితోపాటు బీహార్ కు సంబంధించిన కొందరి అనుచరులతో కలసి అధికారులు భూమి కొలవడం ఏమిటనేది చర్చనీయాంశం. రహదారిని వెడల్పు చేయాల్సిందే అంటూ ఎమ్మార్వో హుకుం జారీ చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. మీకు ఇంత పొలం లేదు సర్వే చేస్తామంటూ రైతులను భయభ్రాంతులకు గురి చేశారు. దిక్కుతోచనిస్థితిలో అన్నదాతలు.. అధికారులతో వాదిస్తున్న తరుణంలో మా విధులకు ఆటంకం కలిగించారని కుంటిసాకుతో పడకంటి కృష్ణయ్య, మరికొందరి రైతులపై అక్రమ కేసులు పెట్టారు. బొక్కల ఫ్యాక్టరీ యాజమానికి సపోర్ట్ చేస్తూ భూమినే నమ్ముకుని బతికే అన్నదాతలను జైలు పాలు చేయడానికి అధికారులు కంకణ బద్ధులయ్యారని తెలుస్తుంది. ఈ తరుణంలో పడకంటి కృష్ణయ్యను జైలుకు పంపించాల్సిందిగా ఎమ్మార్వో రాసిన రాతలు ఎస్సై చేసిన కేసులు జైలుకు వెళ్లక తప్పలేదు. న్యాయం అనేది ఉంటే రేపటికైనా న్యాయమే గెలుస్తుందని నమ్ముకున్న రైతులకు బస్సు డ్రైవర్ న్యాయం దొరికేనా… రేపటి మీ ఆదాబ్ హైదరాబాద్ లో… పూర్తి వివరాలతో మరో కథనం ప్రచురిస్తాం.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS