- రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామ చేస్తా
- అప్ పార్టీ నుండి మరొకరు సీఎం అవుతారు
- ఢిల్లీలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ అప్ పార్టీలో చీలికలు తెచ్చింది
- సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉందనని,రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.ఆదివారం ఢిల్లీలోని అప్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సంధర్బంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ,అప్ పార్టీ నుండి మరొకరు సీఎం అవుతారని తెలిపారు.రెండు,మూడు రోజుల్లో సీఎం ఎంపిక కోసం సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఢిల్లీలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ అప్ పార్టీలో చీలికలు తెచ్చిందని విమర్శించారు.పార్టీని ముక్కలు చేయడం కోసమే తనను జైలుకి పంపారని ఆరోపించారు.ఆమ్ ఆద్మీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడే ముందుండి నడిపించడాని తెలిపారు.రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే సీఎం పదవికి రాజీనామ చేయలేదని అన్నారు.