Sunday, November 24, 2024
spot_img

ఎమ్మెల్యేలకు రక్షణగా..కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహం

Must Read
  • పది మంది ఎమ్మెల్యేలకు రక్షణగా కాంగ్రెస్ సరికొత్త వ్యూహం
  • ఎమ్మెల్యేలను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలన్న ప్రతిపాదన తెరపైకి
  • దీంతో చేరినోళ్లకు రక్షణ .. చేరొటోళ్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం
  • పదిమందిలో ఏడుగురిది సేఫ్ జోన్.. ముగ్గురిదీ డేంజర్ జోన్
  • బీఆర్‌ఎస్‌ ఎల్పీ విలీనమే ఎజెండాగా పావులు కదిపిన కాంగ్రెస్‌
  • తన లక్ష్యాన్ని చేరుకోలేక పదిమందితో సరిపెట్టుకుందంటూ ప్రచారం
  • ఇక నుంచి ఒక్కరు కూడా పార్టీ మారరంటూ గులాబీ పార్టీ అల్టిమేటం
  • ముగ్గురు తప్ప అందరూ పార్టీ లో చేరతారంటు స్పష్టం చేస్తున్న కాంగ్రెస్

బీఆర్ఎస్ అనుకున్నదొక్కటి ..కాంగ్రెస్ చేస్తోంది మరొక్కటి గా తెలుస్తోంది..పార్టీ ఫిరాయింపులపై రోజు రోజుకు డోస్ పెంచుతున్న గులాబిదళానికి చెక్ పెట్టె ఆలోచనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలు నూతన ప్రతిపాదనను తెరమీదకు తీసుకు వస్తున్నారు..ఈ వ్యూహంతోనైన పింక్ పార్టీ విమర్శలకు శాశ్వతంగా పులిస్టాప్ పడుతోందని కాంగ్రెస్ భావిస్తోంది.. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోగా, వారిలో ముగ్గురిపై అనర్హత వేటు కత్తిలా వేలాడుతోంది. మిగిలిన ఏడుగురిపైనా చర్యలు తీసుకోవాలని అటు న్యాయస్థానం,ఇటు అసెంబ్లీ స్పీకర్ వద్ద బీఆర్ఎస్ గగ్గోలుపెడుతోంది.ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేరిన మొత్తం పది మంది ఎమ్మెల్యేల రక్షణ బాధ్యత ప్రభుత్వ పెద్దలకు సవాలుగా మారింది.వచ్చేటోళ్ల సంగతి అటుంచితే ఉన్నోళ్లను ఎలా కాపాడుకోవాలో అర్ధం కాలేని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది..బీఆర్‌ఎస్‌ ఎల్పీ విలీనమే ఎజెండాగా ఇన్నాళ్లు పావులు కదిపిన కాంగ్రెస్‌.. తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని.దానిని పూర్తిగా అడ్డుకున్నామని బీఆర్‌ఎస్‌ తెగ సంబరపడిపోతుండగా..మీ సంతోషం మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసిపోనుందని కాంగ్రెస్ సెటైర్లు విసురుతోంది.బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలంటే ఆ పార్టీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు బయటకు రావాల్సివుంటుంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు అధికారికంగా 38 మంది ఎమ్మెల్యేలు ఉండగా,ఇందులో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో చేతులు కలిపారు.ఇక మిగిలిన 28 మందిలో 16 మందిని కలుపుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేసిన కాంగ్రెస్‌ ప్రస్తుతానికి మౌనం వహిస్తుంది.

వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు

ప్రభుత్వం ఆశించినట్లు బీఆర్‌ఎస్‌ నుంచి చేరేందుకు మిగిలిన ఎమ్మెల్యేలు ఆసక్తి చూపకపోవడం…. ఈ లోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌… సభాపతిపై ఒత్తిడి పెంచేందుకు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు కూడా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా తీర్పునివ్వడంతో ప్రభుత్వం ప్లాన్‌ బీ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని ప్రతిపాదన తెరపైకి..

హైకోర్టు సూచనల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సివుంటుందని భావించిన కాంగ్రెస్‌ … తన అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మస్త్రాన్ని బయటకు తీసినట్లు చెబుతున్నారు. శాసనసభ నిబంధనల ప్రకారం ఏదైనా రాజకీయ పార్టీ నుంచి నాలుగో వంతు సభ్యులు బయటకు వచ్చి తమను సెపరేట్‌ గ్రూప్‌గా గుర్తించాలని కోరితే అనర్హత వేటు నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. దీంతో కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు త్వరలో స్పీకర్‌ను కలిసి తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరనున్నట్లు తెలుస్తోంది..

కాంగ్రెస్‌ ప్లాన్‌ లీక్‌!

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, పీఏసీ చైర్మన్‌ గాంధీ మధ్య వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఈ గొడవకు దారితీసిన పీఏసీ చైర్మన్‌ నియామకానికి..పది మంది ఎమ్మెల్యేలను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలనే అసలు వ్యూహమే కారణమంటున్నారు విశ్లేషకులు. గాంధీ కాంగ్రెస్‌లో చేరినా, ప్రతిపక్ష నేతగా చూపిస్తూ పీఏసీ చైర్మన్‌గా నియమించడంతో టెక్నికల్‌గా మిగిలిన ఎమ్మెల్యేలకూ రక్షణ కల్పించొచ్చని కాంగ్రెస్‌ ఆశిస్తోందని తెలుస్తోంది. అయితే దీనిపై న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్న కాంగ్రెస్‌ పెద్దలు నేడో..రేపో ఈ వ్యూహాన్ని అమలు చేయొచ్చని టాక్‌ నడుస్తోంది.ఇప్పటివరకు గుట్టుగా ఉంచిన కాంగ్రెస్‌ ప్లాన్‌ తాజాగా లీకైంది. ఈ వ్యూహం ప్రకారమే కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్‌గా నియమించారంటున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేకు పీఏసీ పదవి ఎలా ఇస్తారని బీఆర్ఎస్‌ నిలదీయడం.దీనిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తూ వ్యవహారాన్ని రచ్చ చేయడంతో కాంగ్రెస్‌ అసలు ప్లాన్‌ బయటపడిందని అంటున్నారు.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS