- దేశంలో 2026 నాటికి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుంది
- హింస,ఆయుధాలను వీడి మావోయిస్టులు లొంగిపోవాలి
- మావోయిస్టులను హెచ్చరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
దేశంలో 2026 నాటికి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.మావోయిస్టులు హింస,ఆయుధాలను వీడి లొంగిపోవాలని కోరారు.లేదంటే అల్-అవుట్ ఆపరేషన్ నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.మావోయిస్టుల హింస,భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పేందుకు ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారని స్పస్టం చేశారు.మావోయిస్టులు ఒకప్పుడు నేపాల్ లోని పశుపతినాథ్ నుండి తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు,కానీ మోదీ నేతృత్వం దాన్ని ధ్వంసం చేశారని తెలిపారు.ఛత్తీస్గఢ్ లోని నాలుగు జిల్లాల్లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లో భద్రత బలగాలు విజయం సాధించారని అన్నారు.