Sunday, September 22, 2024
spot_img

ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌పై అరికో కేఫ్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం

Must Read
  • విశ్వసనీయమైన సమాచారం మేరకే దాడులు నిర్వహించాం
  • ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులపై అవాస్తవమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదు
  • డైరెక్టర్ ఆఫ్ ఎన్‎ఫోర్స్‎మెంట్,ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ వి.బి.కమలాసన్ రెడ్డి

సెప్టెంబర్ 05న జూబ్లీహీల్స్ లో ఉన్న అరికో కేఫ్ తినుబండారాల కేఫ్ పై ఎక్సైజ్,టాస్క్‎ఫోర్స్ అధికారులు కేఫ్ సిబ్బందిపై ఒత్తిడి చేసి,మద్యం మిశ్రమంతో విస్కీ,ఐస్ క్రీమ్ తయారు చేయించుకున్నారని, అంతేకాకుండా రూ.25 వేల రూపాయలు లంచం ఆడగగా,అవి ఇవ్వనందుకు కేసు నమోదు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై ఎక్సైజ్ అధికారులు ఖండించారు.ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ఎన్‎ఫోర్స్‎మెంట్,ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ వి.బి.కమలాసన్ రెడ్డి పత్రిక ప్రకటన జారీ చేశారు.హైదరాబాద్ నగరంలో వేల సంఖ్యలో కేఫ్‎లు,తినుబండారాల వ్యాపారం చేసే సంస్థలు ఉన్నాయని,అయిన ఏ ఒక్క రోజు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు వాటిపై దాడులు చేయలేదన్న విషయం గమనించాలని తెలిపారు.కానీ అరికో కేఫ్‎లో ఐస్ క్రీమ్‎ని విస్కీతో తయారు చేసి కస్టమర్లకు అమ్ముతున్నరని విశ్వసనీయమైన సమాచారం రావడంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు చెందిన స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం,సమాచారాన్ని నిర్ధారించేందుకు కస్టమర్ల మాదిరిగా అరికో కేఫ్ ను ఫోను ద్వారా సంప్రదించి,కస్టమర్ గా తమను తాము పరిచయం చేసుకుని,విస్కీ చాక్లెట్ గురించి ఆరా తీయడం జరిగిందని అన్నారు.

ఫోన్ కు స్పందించిన రిసెప్షన్,టాస్క్.ఫోర్స్ అధికారులకు మేనేజర్ శివ దేవి రెడ్డి నెంబర్ ఇచ్చారని,మేనేజర్‎కు అధికారుల ఫోను నెంబరు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు.మేనేజర్ శివ దేవి రెడ్డి టాస్క్ ఫోర్స్ అధికారులను కాంటాక్ట్ చేసి, చెఫ్ దయాకర రెడ్డి నంబర్ ఇస్తూ చెఫ్‎ను ఫోన్ చేయాలని అన్నారని,దీంతో అధికారులు చెఫ్ ను సంప్రదించగా ఆర్డర్ పెడితే తయారు చేసి ఇస్తామని చెప్పినట్టు తెలిపారు.ఆ తర్వాత సెప్టెంబర్ 05న ఉదయం 09:10 గంటలకు అరికో కేఫ్ నుండి వారే స్వయంగా ఫోన్ చేసి,ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తే,విస్కీ ఐస్ క్రీమ్ తయారుచేసి ఇస్తామని వాట్సప్ చాట్ ద్వారా అన్నట్టు పేర్కొన్నారు.దీంతో ఎక్సైజ్ అధికారులు ఆ వాట్సప్ మెసేజ్ ఆధారంగా ఆర్డర్ కన్ఫర్మ్ చేసి,తిరిగి అరికో కేఫ్ నుండి అడ్వాన్స్ పంపమని మెసేజ్ వచ్చిందని తెలిపారు.వెంటనే ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం అరికో కేఫ్ ఇచ్చిన నెంబర్ కి అడ్వాన్స్ రూపంలో పదివేల రూపాయలను బదిలీ చేయడం జరిగిందని స్పస్టం చేశారు.

అనంతరం విస్కీ ఐస్ క్రీం తయారు చేసిన తర్వాత ఆర్డర్ తీసుకొని వెళ్లాలని అధికారులకు వాట్సప్ మెసేజ్ వచ్చిందని తెలిపారు.దీంతో అధికారులు వారు పంపిన లొకేషన్ కి వెళ్ళి మద్యం ఉల్లంఘనలు జరిగాయని,విస్కీ మిశ్రమంతో ఐస్ క్రీమ్ తయారు చేశారని నిర్ధారించుకున్న తర్వాతనే అధికారులు దాడి చేయడం జరిగిందని స్పష్టం చేశారు.ఈ దాడిలో ఆరికో కేఫ్ మద్యం మిశ్రమంతో తయారుచేసిన (11.5) కిలోల విస్కీ,మిశ్రమంతో చేసిన ఐస్ క్రీమ్‎ను స్వాధీనం చేసుకోవడమే కాకుండా అందుకు వినియోగించిన,విస్కీ బాటిల్,వోడ్కా బాటిల్,ఆలివ్ ఆయిల్ బాటిల్లను సెంట్రల్ కిచెన్ నుండి,చట్ట ప్రకారం అనుసరించవలసిన పద్ధతిలో మీడియేటర్స్ సమక్షంలో పంచనామా నిర్వహించి,వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.స్వాధీనం చేసుకున్న కేక్ శాంపిల్స్ కూడా ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీకి నిర్ధారణ పరీక్షల కోసం పంపించడం జరిగిందని అన్నారు.అరికో కేఫ్ రిసెప్షన్ సిబ్బందికి,ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లో రికార్డ్ అయిన విషయం అరికో కేఫ్ యాజమాన్యం విస్మరించి, ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులపై అవాస్తవమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదని తెలిపారు.ఇప్పటికైనా ఆరికో కేఫ్ యాజమాన్యం తప్పుడు ఆరోపణలు మానుకోవాలని కోరారు.

Latest News

మూడో రోజు ముగిసిన ఆట,చెలరేగిపోయిన భారత్ బ్యాటర్స్

చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు బ్యాటర్స్ చెలరేగిపోయారు.రిషబ్...
- Advertisement -spot_img

More Articles Like This