Sunday, November 24, 2024
spot_img

ఓవైసీకి ఉగ్రవాదులతో ఉన్న సంబంధాల పై ఆధారాలు ఉన్నాయి

Must Read
  • ఎంఐఎం పార్టీకి,ఓవైసీకి ఉగ్రవాదులతో లింక్స్ ఉన్నాయి
  • కేంద్రమంతి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు
  • ఓవైసీ కళాశాలలో ఉగ్రవాది ఫ్యాకల్టీ ఉన్నాడు
  • మా వద్ద పక్క ఆధారాలు ఉన్నాయి
  • సెక్యులర్ అని చెప్పుకుంటున్న ఓవైసీ,ఏ ఒక్క హిందూ పండుగను ఎందుకు జరుపుకోరు
  • అమృత్ స్కీంలో అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నాడు
  • అవినీతిపై ఆధారాలు ఉంటే ఇవ్వండి
  • కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది
  • బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసుపై విచారణ ఎందుకు జరపలేదు
  • ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది..?
  • హైడ్రాకి నేను వ్యతిరేకం కాదు
  • అక్రమ కట్టడాలపై బీఆర్ఎస్ ఎందుకు విచారణ జరపలేదు

ఎంఐఎం పార్టీకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆదివారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన అయిన,ఓవైసీ,ఎంఐఎం పార్టీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఉగ్రవాదులతో ఓవైసీకి ఉన్న సంబంధాలపై తమ వద్ద పక్క ఆధారాలు ఉన్నయని,ఓవైసీ కళాశాలలో ఓ ఉగ్రవాది ఫ్యాకల్టీ ఉన్నాడని విమర్శించారు.సెక్యులర్ అని చెప్పుకుంటున్న ఓవైసీ ఏ ఒక్క హిందూ పండుగను ఎందుకు జరుపుకోరని ప్రశ్నించారు.బీజేపీకి ఇస్లాం ఫోబియో ఉందని,ఓవైసీ అంటున్నారు,మరి 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతామని చెప్పిన వారికి హిందూ ఫోబియో ఉందా అని నిలదీశారు.మేము హిందువులం,అందుకే పీర్ల పండుగను జరుపుకుంటామని వ్యాఖ్యనించారు.

అమృత్ స్కీం అవినీతిపై ఆధారాలు ఇవ్వండి :

అమృత్ స్కీంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పై కేంద్రమంత్రి బండిసంజయ్ స్పందించారు.అమృత్ స్కీంలో అవినీతి జరిగిందని కేటీఆర్ బీజేపీ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.ఒకవేళ అమృత్ స్కీం అవినీతి పై ఆధారాలు ఉంటే తమకు సమర్పించాలని,ఆధారాల పై కేంద్రం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పడు ఓటుకు నోటు కేసుపై ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు.కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శించారు.

అక్రమ కట్టడాలకు కారణమైన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలి :

హైడ్రా కూల్చివేతల పై కేంద్రమంత్రి బండిసంజయ్ స్పందిస్తూ,తాను హైడ్రాకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆక్రమణ కట్టడాలపై ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు.ఆక్రమణ కట్టడాలకు కారణమైన బీఆర్ఎస్ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.చెరువులను ఆక్రమించిన వారు ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైన చర్యలు తీసుకోవాలని సూచించారు.నిష్పాక్షిపాతంగా ఆక్రమణలను కూల్చాలని అన్నారు.

ఈ సంధర్బంగా బండిసంజయ్ మాట్లాడుతూ,బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శించారు.ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి.. ఓటుకు నోటు, కేసు ఏది.. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందన్నారు. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి లోపాయకారి అంగీకారం ఉందన్నారు. అమృత్ స్కీం అవినీతి పై ఆధారాలు ఇవ్వండి విచారణ జరిపి కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓటుకి నోటు కేసు ఏమైందని నిలదీశారు.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS