Sunday, November 24, 2024
spot_img

రాష్ట్రంలో బీఆర్ఎస్‎కు భవిష్యత్తు లేదని తేలిపోయింది

Must Read
  • యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలి
  • బామ్మర్ది కథను సృష్టించి కేటీఆర్ బద్మాష్ నాటకాలు ఆడుతున్నారు
  • రాష్ట్రంలో బీఆర్ఎస్‎కు భవిష్యత్తు లేదని తేలిపోయింది
  • కేటీఆర్ నోటికొచ్చిన అబద్ధాలాడుతూ,ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ కోరారు.అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయని కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నమని తెలిపారు.బామ్మర్ది కథను సృష్టించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బద్మాష్ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.గెలిపించిన ప్రజలను వదిలేసి,బంధువులకు దోచిపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వంను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని,పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా అడ్రస్ గల్లంతు చేశారని ఎద్దేవా చేశారు.యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో ఎటువంటి అనుభవం లేని వ్యక్తి చేత ఆర్కిటెక్ట్ పనులు చేయించడం ఎంతవరకు సమంజసం అని కేటీఆర్ ను ప్రశ్నించారు.కేవలం జీయర్ స్వామి మెప్పుకోసం ఆనంద సాయి అనే సినిమా సెట్టింగులు వేసే వ్యక్తికి పనులు అప్పజెప్పి దాదాపు 30 కోట్ల రూపాయలు చెల్లించారని విమర్శించారు.యాదాద్రి దేవాలయ పనుల్లో జరిగిన అవకతవకలపై దేవాదాయ శాఖ ఉన్నత స్థాయి విచారణ జరపాలని కోరారు.రాష్ట్రంలో బీఆర్ఎస్‎కు భవిష్యత్తు లేదని తేలిపోవడంతో,కేటీఆర్ నోటికొచ్చిన అబద్ధాలాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో పరిష్కరిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నదని,ప్రజల్లో రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేటీఆర్ చవకబారు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు.సృజన్ రెడ్డికి-కేటీఆర్ కి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్న విషయం వాస్తవం కాదా అని నిలదీశారు.కేటీఆర్ కు ఉన్న బినామీల్లో సృజన్ రెడ్డి ఒకరు అని,ఈ సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అని అన్నారు.కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కాలంలో హెచ్ఎండిఏ పరిధిలో ఎన్ని భూములను కన్వర్షన్ చేశారని ప్రశ్నించారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని అక్రమాలు జరిగాయో,మీ కుటుంబం ఎంత అవినీతికి పాల్పడిందో చెప్పాలంటే,‘‘రాస్తే రామాయణం వింటే మహాభారతం అంత కథ ఉందని” వ్యాఖ్యనించారు.బీఆర్ఎస్ పాలనలో దేవుళ్లను కూడా వదిలిపెట్టలేదని విమర్శించారు.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS