Monday, September 23, 2024
spot_img

మందు బాబులకు అడ్డాగా మారిన రైతు వేదిక

Must Read
  • అక్కరకు రాని జాన్‌ పహాడ్‌ రైతు వేదిక
  • కొరవడిన పర్యవేక్షణ..
  • అధికారుల పనితీరుపై మండిపడుతున్న రైతులు..
  • మద్యం,సిగరెట్‌,పాన్‌ పరాక్‌ కు అడ్డాగా మారిన దుస్థితి..
  • వాడకంలోకి తీసుకురావాలని కోరుతున్న రైతులు..

ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో రైతు వేదికలను నిర్మించింది.జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతు వేదికలు ఉత్సవ విగ్రహాలుగా,నిరుపయోగంగా మారాయి.వ్యవసాయ అధికారులను కలవాలంటే మండల,జిల్లా కేంద్రానికో వెళ్లాల్సిన దుస్తుతి. గ్రామీణ ప్రాంతాల్లోనే రైతు వేదికలను నిర్మించి,అక్కడికే ప్రతిరోజు వ్యవసాయ అధికారులను వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.అయితే రైతు వేదికల్లో అరకొర సౌకర్యాలు,నీటి వసతి,విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో చాలా చోట్ల వ్యవసాయ అధికారులు రైతు వేదికలకు వెళ్లడం లేదు.

వ్యవసాయాధికారులు సాగులో అధునాన పద్ధతులు,యాంత్రికరణ,చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలంటే వేదికల దొరకటం కష్టతరం.వీటన్నింటినీ గుర్తించిన గత ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వ సహాయంతో సుమారు రూ.22 లక్షలు ఖర్చు చేసి రైతు వేదికలను అందుబాటులోకి తీసుకొచ్చింది.2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన పథకాలను,బహుళ ప్రయోజనాలను తెలుసుకోవడానికి ఆ రైతు వేదికలకు వెళ్లాలంటే మొహమాటం పడుతున్నారు.అధికారుల పనితీరు,ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు నిదర్శనమని పలు రైతు సంఘాల నాయకులు,అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు.

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్న వైనం..

గత ప్రభుత్వం పాలకవీడు మండల వ్యాప్తంగా 3 రైతువేదికలను ఏర్పాటు చేసింది.అయితే రైతు వేదికల్లో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను రైతులకు వివరించేందుకు,అలాగే వారికి ఎదురయ్యే సమస్యలను అధికారులు గుర్తించి వాటిని పరిష్కరించడానికి ఏర్పాటుచేసిన వేదికనే రైతు వేదిక.ఈ రైతు వేదికలో రైతులు ఏ కాలంలో ఏ పంటలు వేసి అధిక లాభాలు గడిరచాలో, పంటలు పండిరచే సమయంలో రైతుల్లో కలిగే సందేహాలను అధికారులు నివృత్తి చేయాల్సిన బాధ్యత మండల వ్యవసాయాధికారి,గ్రామ వ్యవసాయాధికారిదే. గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు వేదికలపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సాధించకపోవడంతో కొన్నిచోట్ల దుమ్ము,ధూళిని తలపిస్తుండగా మరి కొన్నిచోట్ల మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి.

అధికారులు కన్నెత్తి చూడని కారణంగా రైతు వేదిక క్లస్టర్లు అసాంఘిక కార్యక్రమాలకు వేదికలుగా మారుతున్నాయని రైతులు,గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.పాలకవీడు మండలం జాన్‌ పహాడ్‌ రైతు వేదికలో నిత్యం రాత్రి వేళ మద్యం ప్రియులకు మత్తు పానీయాలు సేవించడానికి,సిగరెట్‌,పాన్‌ పరాకులు తినడానికి నిలయంగా మారింది.ఈ సంఘటన స్థలాన్ని చూస్తేనే తెలుస్తుంది అధికారుల పనితీరు.ఇక్కడి ప్రజాప్రతినిధులు సైతం సందర్శించకపోవడమే ఇందుకు నిదర్శనమని గ్రామస్తులు,రైతులు భావిస్తున్నారు.అటు అధికార పార్టీ నాయకులు,ఇటు ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Latest News

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 200 మీటర్స్ పరుగు పందెం పోటీలు

యూత్ యాక్టివిటీస్ లో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో బాల,బాలికలకు 200 మీటర్స్ పరుగు పందెం...
- Advertisement -spot_img

More Articles Like This