వరద బాధితులకు సహాయం చేసేందుకు నటుడు మహేష్ బాబు ముందుకొచ్చారు.ఈ సంధర్బంగా సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల రూపాయల విరాళం అందించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసి విరాళం చెక్కు అందజేశారు.ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ (ఏఎంబీ) తరపున కూడా మరో రూ.10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు.మహేశ్ బాబు వెంట సతీమణి నమ్రత కూడా ఉన్నారు.సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారిని ముఖ్యమంత్రి అభినందించారు.